జాతి వైరం.. చిరుతను వెంటాడి.. చంపి తిన్న పులి.. ప్రాణాలు తెగించి ఫోటోలు తీసిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ..
బెంగళూరుకు చెందిన ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హర్ష నరసింహమూర్తి రాజస్థాన్లోని రణధంబోర్ నేషనల్ పార్క్ లో చిరుతని పులి చంపి తినే అరుదైన ఛాయాచిత్రాలను తన కెమెరాలో బంధించారు. IFS అధికారి పర్వీన్ కస్వాన్ నరసింహ మూర్తి చిత్రాలను ట్వీట్‌లో పంచుకున్నారు. వేటగాడు ఎప్పుడు వేటాడబడ్డాడు అని ట్వీట్‌లో రాశాడు.
Tiger Eats Leopard: ఈ అద్బుతమైన సృష్టి ఎన్నో రకాల జీవులకు నిలయం. ప్రతి జీవరాశి ప్రత్యేకమైన జీవనశైలి ఉంటుంది. వాటికి కూడా ప్రేమ, అనురాగాలను ఉంటాయి. కానీ, అధిపత్యం కోసం, మనుగడ కోసం తెలియదు కానీ.. కొన్ని జీవుల మధ్య మాత్రం పుట్టుకతోనే వైరం ఏర్పడుతూ ఉంటుంది. ఆ రెండు జాతులు( జీవులు) ఎప్పుడైనా ఎదురైతే చాలు.. ఇక వాటి మధ్య బీకరమైన యుద్దమే.. ఈ రెండు జీవులలో ఏదోక జీవి తన ప్రాణాలు కోల్పోవల్సిందే. ఇలా జాతి వైరం ఉన్న జీవుల్లో నాగుపాము ముంగిస, కుక్క పిల్లి ముందు వరుసలో ఉంటాయి. కానీ .. ఎప్పుడు కని విని ఎరుగని ఘటన వెలుగులోకి వచ్చింది..
అదే చిరుతను చంపి తిన్న పులి. చదవడానికి చాలా కొత్తగా , ఆశ్చర్యంగా ఉంది కాదా..! ఆశ్చర్యంగా ఉన్న మీరు చదివింది మాత్రం అక్షరాల నిజం. ఈ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చే వరకు పులి చిరుతను తింటుందనే విషయం చాలా మందికి తెలియగా పోవచ్చు. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో జరిగింది. బెంగుళూర్ కు చెందిన ఓ ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ హర్ష నరసింహమూర్తి ఫోటోలు తీసి.. నెట్టింట్లో షేర్ చేయడంతో .. ఈ విషయం తెలిసింది.
హర్ష నరసింహ మూర్తి అనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.. ఆ ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధిస్తారు. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి .. బయటి ప్రపంచానికి పరిచయం చేస్తారు. ఈ క్రమంలోనే ఆయన ఎన్నో ఆశ్యర్యకర విషయాలను వెలుగులోకి తీసుక వచ్చారు. ఇటీవల నరసింహ మూర్తి తన సహోద్యోగులతో కలిసి రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు. మార్చి 30 తెల్లవారుజామున నేషనల్ పార్క్ లోకి ఎన్టార్ అయ్యారు. తొలుత వారికి పులి పాదముద్రలు కనిపించాయి. వాటిని చూసిన ఆయన, ఆయన సహోద్యోగులు వాటిని అనుసరించుకుంటూ వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక.. పులి పాద ముద్రలతో పాటు.. చిరుత పాద ముద్రలు కూడా కనిపించాయి. కాస్త భయమేసినా.. అడుగులో అడుగు వేసుకుంటూ.. ముందుకు సాగారు.
అలా ముందుకు సాగుతుంటే.. ఆయనకు ఓ ఆశ్చర్యకరమైన ఘటన కంటబడింది. అప్పుడే వేట ముగించిన పులి.. గర్జిస్తూ.. తన ఆహారాన్ని తింటుంది. ఆ ఘటనను చూసి వారు భయాందోళనకు గురయ్యారు. అయినా ఆయన వెనుకడుగు వేయకుండా .. తీక్షణంగా పరిశీలించి చూశారు. ఆ పులి తింటుంది.. జింకనో .. లేడీనో .. కాదు.. అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తే.. చిరుత. ఆ చిరుతను వెంటబడి .. వేటాడి .. చంపి మరి తింటుంది ఆ పులి.గతంలో ఒక మారు ఇటువంటి దృశ్యాన్ని దూరం నుండి చూసినప్పటికీ కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయిన హర్ష నరసింహమూర్తి ఈసారి 40 50 అడుగుల దూరం నుండి ఆ చిత్రాలను కెమెరాలో క్యాప్చర్ చేయగలిగారు. టీ101 గా గుర్తించిన ఒక పులి ఇటీవల నేషనల్ పార్క్ లోని జోన్ 1 లో చిరుత పులిని చంపి తింటూ కనిపించింది.
ఈ అరుదైన చిత్రాలను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వన్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. చిరుత పులిని తినే పులిని మీరు ఎప్పుడైనా చూసారా అంటూ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు.
అడవులలో జరిగే ఇటువంటి సంఘటనలు క్యాప్చర్ చేయడం చాలా అరుదు అని.. ఈ సంఘటనను ఎవరు ఊహించలేరు అని ఆయన పేర్కొన్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నరసింహమూర్తి గతేడాది కూడా ఇలాంటి చిత్రాన్ని క్లిక్ చేశారు. ఈ ఘటనపై పర్యావరణ జీవ శాస్త్రవేత్త డాక్టర్ సంజయ్ గుబ్బి మాట్లాడుతూ.. అడవిలో తమ అధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం పులులు చిరుత పులులను ఇలా వేటాడుతాయని, తనకు పోటీ లేకుండా చేసుకుంటాయని తెలిపారు. చిరుతలకు, పులులకు మధ్య వైరం ఉండటం సహజమేనని తెలిపారు.