చెన్నై: కట్టుకున్న భర్త, బంగారం లాంటి ఇద్దరు పిల్లలు వుండగా ఓ వివాహిత పెడదారి పట్టింది. శారీరక సుఖం కోసం మరో యువకుడితో సంబంధాన్ని సాగిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంది.  ఇలా వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు తీసి, భర్తను జైలుపాలు చేసి వారి ఇద్దరు పిల్లలను అనాధలుగా మార్చింది. 

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరువలంగాడు సమీపంలోని మొన్నవేడు గ్రామంలో రాజ్ కుమార్-ప్రియాంక దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే చాలాకాలంగా ప్రియాంక నార్తావాడ గ్రామానికి చెందిన కార్తిక్(27) అనే యువకుడితో అక్రమసంబంధాన్ని సాగించింది. ఈ విషయం ఇటీవలే రాజ్ కుమార్ కు తెలిసింది. దీంతో తనను మోసం భార్యను ఎలాగయినా హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. 

ఇందులోభాగంగా కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి భార్య ప్రియాంకతో తాగించాడు రాజ్ కుమార్. భార్య రెండు చేతులను కట్టేసి బలవంతంగా ఈ కూల్ డ్రింక్ తాగించాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రాజ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుపాలవడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. ఇలా వివాహేతర సబంధం ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.