చెన్నై: కుటుంబ పరువును తీస్తుందన్న కోపంతో కోడలిని అత్యంత దారుణంగా హతమార్చాడో మామ. తన కొడుకు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నెరుపుతున్నందునే తన కోడలిని చంపినట్లు తెలిపాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకుంది. 

సేలం జిల్లా తంబంపట్టిలో అరివళగన్, ఆముద దంపతులు నివసిస్తున్నారు. అరిగళవన్ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. దీంతో అతడు ఇంట్లోంచి ఉదయం బయటపడి ఎప్పుడో రాత్రికి చేరుకునేవాడు. దీంతో ఆ సమయంలో ఆముద వేరే వ్యక్తితో అక్రమ సంబంధాన్ని నడిపేదని అరివళగన్ తండ్రి పళని(63) ఆరోపించాడు.R

read more  లవ్ అఫైర్: యువతి ప్రైవేట్ పార్ట్స్ పై తుపాకీతో కాల్పులు, మృతి 

ఇలా తన కోడలి అక్రమసంబంధం కారణంగా కుటుంబ పరువు బజారున పడుతోందని భావించాడు. దీంతో ఎలాగయినా ఆమెను హతమార్చాలన్న దారుణ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ క్రమంలోనే కొడుకు అరివళగన్ ఇంట్లోంచి బయటికివెళ్లగానే ఒంటరిగా వున్న కోడలిని దారుణంగా హతమార్చాడు. 

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. తానే హత్య చేసినట్లు అంగీకరించడంలో పళనిని అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.