వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరివేసుకుని.. ఐఐటీ విద్యార్థి బలవన్మరణం...
కొన్ని నెలలుగా ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ ఐఐటీ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను డిప్రెషన్‌కు కూడా చికిత్స తీసుకుంటున్నాడని తల్లిదండ్రులు తెలిపారు.
ఢిల్లీ : ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం కలవరం కలిగిస్తోంది. ఒత్తిడిని తట్టుకోలేక ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఓ ఘటనే ఢిల్లీలో వెలుగు చూసింది. 23 ఏళ్ల ఐఐటీ-ఢిల్లీ విద్యార్థి తూర్పు ఢిల్లీలోని వివేక్ విహార్ ప్రాంతంలోని తన ఇంట్లో వెయిట్ లిఫ్టింగ్ రాడ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ మేరకు పోలీసులు వివరాలు తెలిపారు. పనవ్ జైన్ అనే అతను బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అతని తల్లిదండ్రులు సాయంత్రం వాకింగ్ నుండి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉరివేసుకుని కనిపించాడు.
రోడ్డు ప్రమాదంలో చిత్రనిర్మాత మృతి.. ఫోన్, గోప్రో కెమెరాలు మాయం...
ఇంట్లోని వెయిట్ లిఫ్టింగ్ రాడ్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ రాడ్ కు దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు అతడిని దగ్గర్లోని పుష్పాంజలి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
తమ కొడుకు గత కొన్ని నెలలుగా ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్నాడని, డిప్రెషన్‌కు కూడా చికిత్స తీసుకుంటున్నాడని పనవ్ తండ్రి పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అతని మృతదేహం దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. తదుపరి విచారణలు కొనసాగుతున్నాయి.