చివరి దశలో ఆదరించేవారు లేకపోతే ఎంతటి వారైనా రోడ్ల  పాలు కావాల్సిందే అని చెప్పేందుకు ఈ ఘటనే సాక్ష్యం. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని ఓ బస్టాప్‌ దగ్గర ఓ వృద్ధుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు

చివరి దశలో ఆదరించేవారు లేకపోతే ఎంతటి వారైనా రోడ్ల పాలు కావాల్సిందే అని చెప్పేందుకు ఈ ఘటనే సాక్ష్యం. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లోని ఓ బస్టాప్‌ దగ్గర ఓ వృద్ధుడు బిచ్చం ఎత్తుకుంటున్నాడు.

అత్యంత దయనీయ పరిస్ధితుల్లో వున్న ఆయన ‘ ఆశ్రమ్ స్వర్గ్ సదన్ ’ సభ్యుల కంట కడ్డారు. దీంతో వారు ఆ వృద్ధుడిని పలకరించారు. అయితే ఆ పెద్దాయన అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటంతో సదన్ సభ్యులు ఆశ్చర్యపరిచారు.

వెంటనే ఆ వృద్ధుడిని వారు తమ ఆశ్రమానికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చారు లాంటి వివరాలు తెలుసుకునేందుకు వారు ప్రయత్నించారు.

తాను ఐఐటీ కాన్పూర్‌లో 1969 బ్యాచ్‌కు చెందిన మెకానికల్ ఇంజినీర్ స్టూడెంట్‌నని ఆయనకు చెప్పుకొచ్చారు. అంతేగాక లక్నోలో ఎల్ఎల్ఎం చేశానని చెప్పారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి దుస్థితి కలగడంపై సదన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయన కుటుంబసభ్యులు ఎవరన్న దానిపై ఆరా తీయడం మొదలుపెట్టారు.

కాగా, కొద్దిరోజుల క్రితం ఆశ్రమ్ స్వర్గ్ సదన్ వాలంటీర్లు ఓ పోలీస్ అధికారిని కూడా ఇదే విధంగా రక్షించారు. మనీశ్ మిశ్రా అనే పోలీస్ ఆఫీసర్‌‌ను ఆయన బ్యాచ్‌మేట్స్ గుర్తించి తమ వద్దకు చేర్చారని.. ఆయన ఆరోగ్యం ఇప్పుడు మెరుగవుతుందని అన్నారు.

1999 బ్యాచ్‌కు చెందిన ఆయన మతిస్థిమితం కోల్పోయి రోడ్డు పాలైనట్టు తెలిపారు. షార్ప్ షూటర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన.. విధుల నుంచి బహిష్కరణకు గురయ్యారు. రెండేళ్లు డ్యూటీకి వెళ్లకపోవడంతో ఆయన్ను డిస్మిస్ చేశారు. 2006 తర్వాత ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియకుండా పోయింది.