Mumbai: ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసుకు సంబంధించి అనేక అంశాలు, వివిధ ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విద్యార్థి దర్శన్ సోలంకి తండ్రి  సిట్ కు లేఖ రాశారు. తన కుమారుడు ఐఐటీలో ఎదుర్కొన్న కుల వివ‌క్ష‌ను గురించి ప్ర‌స్తావించారు. ఈ కేసును కుల వివక్ష కోణంలో దర్యాప్తు చేయాలని ఆయ‌న త‌న లేఖ‌లో కోరారు.

IIT-Bombay student suicide: ఫిబ్రవరి 12న ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ బాంబే మొదటి సంవత్సరం విద్యార్థి దర్శన్ సోలంకి తండ్రి మ‌రో లేఖ‌తో కీల‌క విష‌యాల‌ను ప్ర‌స్తావించారు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఐఐటీ-బాంబే విద్యార్థి దర్శన్ సోలంకి తండ్రి ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) లేఖ రాశారు. కేసును కుల వివక్ష కోణంలో దర్యాప్తు చేయాలని అభ్యర్థించారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య కేసుకు సంబంధించి అనేక అంశాలు, వివిధ ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విద్యార్థి తండ్రి దర్శన్ సోలంకి సిట్ కు లేఖ రాశారు. తన కుమారుడు ఐఐటీలో ఎదుర్కొన్న కుల వివ‌క్ష‌ను గురించి ప్ర‌స్తావించారు. ఈ కేసును కుల వివక్ష కోణంలో దర్యాప్తు చేయాలని ఆయ‌న త‌న లేఖ‌లో కోరారు. ఐఐటీ బాంబేలో విద్యార్థిగా ఉన్నప్పుడు తన కొడుకు కులం కారణంగా వేధింపులకు గురయ్యాడని లేఖ‌లో పేర్కొన్నారు. తన కొడుకు ఎలక్ట్రానిక్ పరికరాల క్లోన్ కాపీలను కుటుంబానికి తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన దర్శన్ సోలంకి (18) ఫిబ్రవరి 12న హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి మరణించాడు.

ఈ కేసును విచారిస్తున్న ముంబ‌యి పోలీసుల సిట్ హాస్టల్ మేట్ వేధింపుల గురించి ప్రస్తావించిన నోట్‌ను స్వాధీనం చేసుకుంది. ఆత్మహత్య లేఖలో సోలంకి మరో విద్యార్థి అర్మాన్ ఇక్బాల్ ఖత్రీ, వివాదం తర్వాత తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, బెదిరించాడని ఆరోపించినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. దర్శన్ సోలంకి కుటుంబం మాత్రం ఇది ఆత్మహత్యగా భావించడం లేదు.

ఇదిలావుండ‌గా, ఆత్మహత్య చేసుకున్న ఐఐటీ బాంబే మొదటి సంవత్సరం విద్యార్థి దర్శన్ సోలంకి తండ్రి తన కుమారుడి మరణంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఇదివ‌ర‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు లేఖ రాశారు. ఆ లేఖ‌లో దాదాపు రెండు వారాలుగా పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది తమ కుటుంబాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసిందని లేఖలో పేర్కొన్నారు. హోం శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్ కు కూడా లేఖ రాశారు.