Asianet News TeluguAsianet News Telugu

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. కారణం ఏమిటంటే?

ఐఐటీ బాంబేకు చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను నివాసం ఉంటున్న ఏడు అంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకి మరణించాడు. అయితే, తన మరణానికి ఎవరు బాధ్యులు కాదని ఆయన ఆత్మహత్యకు ముందు ఆ హాస్టల్ రూమ్‌లోని బోర్డుపై రాశారు. అంతేకాదు, కొంత కాలంగా తాను డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపినట్టు పేర్కొన్నారు. మృతుడిని మధ్యప్రదేశ్‌కు చెందిన దర్శన్ మాల్వియాగా గుర్తించారు. ఆయన ఐఐటీ బాంబేలో గత జులైలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అందులో పీజీ కోర్సు చదువుతున్నట్టు అధికారులు తెలిపారు.
 

IIT bombay student died suicide
Author
Mumbai, First Published Jan 17, 2022, 1:33 PM IST

ముంబయి: దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థల్లో ఐఐటీలది అగ్రస్థానం. ఆ విద్యా సంస్థల్లో సీటు దొరికితే చాలు అనుకునే వారు లక్షల్లో ఉంటారు. అందులో చదువు ముగించుకున్న వారికి మార్కెట్ ఎర్రతివాచీ పరుస్తుంది. కోట్ల వేతనాల ప్యాకేజీతో కంపెనీలు ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అంతటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో పీజీ చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన ఉంటున్న హాస్టల్ భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే, తన ఆత్మహత్యకు కారణాన్ని హాస్టల్ గదిలోని బోర్డుపై రాసి పెట్టారు. తాను డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకున్నారని బోర్డుపై పేర్కొన్నారు. తన ఆత్మహత్యకు ఎవరినీ బాధ్యలుగా ఎంచరాదని తెలిపారు.

మహారాష్ట్ర(Maharashtra) పొవాయిలో ఐఐటీ బాంబే(IIT Bombay)లోని 26 ఏళ్ల విద్యార్థి(PG Student) హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఆయన గతేడాది జులైలో ఐఐటీ బాంబేలో పీజీ కోర్సులో చేరారు. కొంత కాలంగా ఆయన డిప్రెషన్‌(depression)తో బాధపడుతున్నారు. మృతి చెందిన విద్యార్థిని మధ్యప్రదేశ్‌కు చెందిన దర్శన్ మాల్వియాగా అధికారులు గుర్తించారు. ఏడు అంతస్తుల ఆ భవనం వెలుపల దర్శన్ మాల్వియా మృతదేహాన్ని వాచ్‌మెన్ గుర్తించారు. వెంటనే విద్యా సంస్థ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయనను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. కానీ, అప్పటికే దర్శన్ మాల్వియా మరణించినట్టు వైద్యులు తెలిపారు. వెంటనే ఆ విషయాన్ని దర్శన్ మాల్వియా కుటుంబ సభ్యులకు, పోలీసులకు వివరించారు.

యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు రిజిస్టర్ చేసినట్టు పోవాయ్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ బుధన్ సావంత్ వివరించారు. దర్శన్ మాల్వియా తాను ఉంటున్న హాస్టల్ రూమ్‌లోని బోర్డుపై కీలక విషయాన్ని వెల్లడించారని తెలిపారు. కొంతకాలంగా తాను డిప్రెషన్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటనపై మరింత విచారణ చేస్తున్నామని వివరించారు.

కాగా, కేవలం మహమ్మారి భయంతోనే ఓ కుటుంబ సభ్యులు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. Madurai సమీపంలోని కల్మెడులో ఆదివారం నాడు తెల్లవారుజామున ఓ మహిళ, ఆమె మేనల్లుడు  సహా నలుగురు సభ్యులతో కూడిన కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో  అస్వస్థతకు గురైన మరో ఇద్దరు మధురై రాజాజీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 పోలీసుల కథనం ప్రకారంగా  కల్మెడులోని ఎంజీఆర్ కాలనీకి చెందిన Jothika, ఆమె మేనల్లుడు Ritishమృతి చెందారు. జ్యోతిక తల్లి లక్ష్మి, ఆమె సోదరుడు సిబిరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత ఏడాది క్రితం   లక్ష్మి  భర్త, ఆమె మరో కూతురు కూడా మరణించారు.  జ్యోతికికకు ఒక్క రోజు క్రితం కరోనా సోకింది. దీంతో ఆర్ధికంగా చితికి పోతామనే భయంతో ఈ కుటుంబమంతా పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పారు. 

నలుగురు కుటుంబ సభ్యులు విషం తీసుకొని శనివారం  నాడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు ఉదయం జ్యోతిక, రితిష్ లు అక్కడికక్కడే మరణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios