ఐఐఎంసీఏఏ తమిళనాడు చాప్టర్ తొలి వార్షిక సమావేశాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ కూ కనెక్షన్స్ 2022 సమావేశంలో పర్యావరణ రిపోర్టర్ టీఆర్ వివేక్‌కు ఇఫ్కో ఐఐఎంసీఏఏ అవార్డును ప్రముఖ జర్నలిస్టు చిత్ర మహేష్ అందజేశారు.  

చెన్నై: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అల్యూమ్నీ అసోసియేషన్ (ఐఐఎంసీఏఏ) తమిళనాడు చాప్టర్ తొలి వార్షిక అల్యూమ్నీ సమావేశాన్ని చెన్నైలో నిర్వహించారు. రెయిన్ ట్రీ హోటల్‌లో శనివారం ‘కూ కనెక్షన్స్ 2022’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు చిత్ర మహేష్ ఇఫ్కో ఐఐఎంసీఏఏ అవార్డును పర్యావరణ రిపోర్టర్ టీఆర్ వివేక్‌కు అందించారు.

వ్యవస్థాపక సభ్యుడు అనిమేష్ బిస్వామస్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. తమిళనాడు చాప్టర్ కార్యకలాపాలను మరింత మెరుగపరుచుకోవాలని చిత్ర మహేష్ తెలిపారు. ఐఐఎంసీఏఏ అవార్డులు మరింత ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లడానికి అన్ని జర్నలిస్టుల కోసం కనీసం ఒక్క కేటగిరీనైనా ఓపెన్ చేయాలని సూచనలు చేశారు. 

ఐఐఎంసీఏఏ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఉపాధ్యాయ్, సెక్రెటరీ అతుల్ గుప్తా, జసీమ్ ఉల్ హక్, సంస్థ మాజీ సెక్రెటరీ రితేష్ వర్మ, మాజీ ట్రెజరర్ దీక్ష సక్సేనా, కర్ణాటక చాప్టర్ సెక్రెటరీ చైతన్య క్రిష్ణ రాజులూ తమ ప్రసంగాలు ఇచ్చారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అల్యూమ్నీ అసోసియేషన్ (ఐఐఎంసీఏఏ) గతనెల చివరలో ఐఎఫ్ఎఫ్‌సీవో ఐఐఎంసీఏఏ(IFFCO IIMCAA) ఆరో అవార్డు(Award) విజేతలను ప్రకటించింది. దేశరాజధాని ఢిల్లీలోని ఐఐఎంసీ హెడ్‌క్వార్టర్స్‌లో కూ కనెక్షన్స్‌(KOO Connections) వేదికపై ప్రకటించింది. ఈ అవార్డులను రిపోర్టింగ్, అడ్వర్టయిజింగ్, పీఆర్, కమ్యూనికేషన్స్ వంటి ఎనిమిది విభాగాల్లో విజేతలను వెల్లడించింది.

ప్రముఖ జర్నలిస్టు చిత్ర సుబ్రమణియం దువెల్ల, మధుకర్ ఉపాధ్యాయ్, ప్రసిద్ధ భరత నాట్యం డ్యాన్సర్ పద్మశ్రీ గీతా చంద్రన్‌, రాహుల్ శర్మ, పార్థ ఘోష్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటించారు. ఇదిలా ఉండగా, సౌరభ్ ద్వివేదిని అల్యూమ్నీ ఆఫ్ ఇయర్‌గా డిక్లేర్ చేశారు. కాగా, శ్రిష్టి జైస్వాల్ అత్యధిక ప్రైజ్ మనీ గల అవార్డును గెలుచుకున్నారు. అగ్రికల్చర్ రిపోర్టింగ్ విభాగంలో శ్రిష్టి జైస్వాల్ రూ. 1 లక్ష బహుమతిని సొంతం చేసుకున్నారు. కాగా, మిగితా జర్నలిస్టులు అంతా రూ. 50 వేల క్యాష్ ప్రైజు గెలుచుకున్నారు.

జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌ (పబ్లిషింగ్)గా క్రిష్ణ ఎన్ దాస్, జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌ (బ్రాడ్‌క్యాస్టింగ్)గా అజతికా సింగ్‌లు ఈ అవార్డులను గెలుచుకున్నారు. కాగా, పబ్లిషింగ్ కేటగిరీలో ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్టర్‌గా ఎటికాల భవాని, అదే బ్రాడ్‌క్యాస్టింగ్ కేటగిరీలో జ్యోతిస్మిత నాయక్ గెలుచుకున్నారు. ప్రొడ్యూస్ ఆఫ్ ది ఇయర్ విన్నర్‌గా కౌశల్ లఖోటియా, ఏడీ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా విపిన్ ధ్యాని, పీఆర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ముని శంకర్ పాండేలు విన్ అయ్యారు.

ఈ కార్యక్రమంలో 1971-72 గోల్డెన్ జూబిలీ అల్యూమ్నీ బ్యాచ్, 1996-97 సిల్వర్ జూబిలీ అల్యూమ్నీ బ్యాచ్‌లను సత్కరించారు.