Asianet News TeluguAsianet News Telugu

అర్నబ్ అరెస్ట్: ఖండించిన ఐఎఫ్‌డబ్ల్యుజె

 రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది.  అరెస్ట్ సమయంలో ఆయనపై దాడి చేయడాన్ని ఆ సంఘం తప్పుబట్టింది.

IFWJ condemns arrest of Republic TV chief Arnab Goswami lns
Author
Mumbai, First Published Nov 4, 2020, 2:50 PM IST

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి అరెస్ట్ ను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తీవ్రంగా ఖండించింది.  అరెస్ట్ సమయంలో ఆయనపై దాడి చేయడాన్ని ఆ సంఘం తప్పుబట్టింది.

2018లో తల్లీ కొడుకుల ఆత్మహత్య కేసులో అర్నబ్ గోస్వామిని బుధవారం నాడు ఉదయం ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు పాల్ఘర్ లో సాధువులను దారుణంగా హత్య చేసిన ఘటనపై ముంబై పోలీసులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం తీరును బహిరంగంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

అర్నాబ్ తో పాటు రిపబ్లిక్ టీవీలో కీలకమైన హెడ్ లను వేటాడం మానుకోవాలని ఐఎఫ్‌డబ్ల్యుజె అధ్యక్షుడు బీవీ మల్లికార్జునయ్య, ప్రధాన కార్యదర్శి పర్మానంద్ పాండే లు ఓ ప్రకటనలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

also read:అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్

పోలీసుల విచారణకు సహకరించడానికి ఎల్లప్పుడూ స్వచ్చంధంగా ముందుకొచ్చే జర్నలిస్టుపై రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేసిందనేందుకు ఈ ఘటన నిదర్శనంగా పేర్కొన్నారు.

అర్నబ్ ఎప్పుడూ కూడ దేశం వదిలిపోవడానికి ప్రయత్నించలేదని వారు గుర్తు చేశారు.పోలీసులకు ఆయన అందుబాటులోనే ఉన్నాడని చెప్పారు. జాతీయవాద జర్నలిజాన్ని తీవ్రంగా ప్రోత్సహిస్తున్న గోస్వామితో పాటు ఆయన బృందానికి మద్దతు ఇవ్వాలని జర్నలిస్టులను కోరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios