ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్ పూర్వ విద్యార్థుల సంఘం (ఐఐఎంసీఏఏ) తన 11వ వార్షిక సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఢిల్లీలోని హెడ్‌క్వార్టర్‌లో ఆదివారం ఈ సదస్సు నిర్వహించి పలు అవార్డులను ప్రకటించారు. 7వ ఇఫ్కో, ఐఐఎంసీఏఏ అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 

న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అల్యూమ్నీ అసోసియేషన్ (ఐఐఎంసీఏఏ) 11వ వార్షిక అల్యూమ్నీ మీట్ (కనెక్షన్స్ 2023) నిర్వహించింది. దాని ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లో ఆదివారం ఈ సదస్సు నిర్వహించింది. ఇందులో 7వ ఇఫ్కో ఐఐఎంసీఏఏ అవార్డులను ప్రకటించారు. విజేతలను సత్కరించి ట్రోఫీలు, చెక్కులను ఐఐఎంసీ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ సంజయ్ ద్వివేది అందజేశారు.

ఈ కార్యక్రమం ముషాయిరా, కవి సమ్మేళనంతో ప్రారంభమైంది. ప్రముఖ ఉర్దూ కవులు వసీం బరేల్వి, అఖిల్ నొమానీ, రానా యశ్వంత్‌ల కవితలను చదివారు. ఇక రెండో సెషన్‌లో గోల్డెన్ జూబిలీ బ్యాచ్ (1971-73 బ్యాచ్), సిల్వర్ జూబిలీ బ్యాచ్ (1997-98 బ్యాచ్) విద్యార్థులను సత్కరించారు.

కాగా, మూడోసెషన్‌లో ఇఫ్కో ఐఐఎంసీఏఏ అవార్డు విజేతలను సత్కరించారు. ఒడిశా సాహత్యకారుడు డాక్టర్ గాయత్రిబాల పాండా అల్యూమ్నీ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీకరించారు. పబ్లిక్ సర్వీస్ అవార్డు సుశీల్ సింగ్, అమిత్ కతోచ్, పీ లీ ఎత్, పంకజ్ చంద్ర గోస్వామిలు పొందారు. 

కాంపిటీటివ్ కేటగిరీల్లో జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును, రూ. 1.50 లక్షల ప్రైజ్ మనీని బిహార్‌కు చెందిన ఉత్కర్ష్ సింగ్ గెలుచుకున్నారు. అగ్రికల్చర్ రిపోర్టర్ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్ మనీని ఢిల్లీకి చెందిన రోహిత్ విశ్వకర్మ గెలుచుకున్నారు.

రూ. 50 వేల ప్రైజ్ మనీ చొప్పున రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను పబ్లిషింగ్ విభాగంలో ఢిల్లీకి చెందిన ఆండ్రూ అంసాన్, బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో నిబిర్ దేకా (అసోం) గెలుచుకున్నారు. ఇండియన్ లాంగ్వేజ్ రిపోర్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేరళకు చెందిన బిజిన్ శామ్యూల్ (పబ్లిషింగ్ విభాగం), కేరళకు చెందిన సంధ్య మణికందన్ (బ్రాడ్‌క్యాస్టింగ్ విభాగం) గెలుచుకున్నారు. 

ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఢిల్లీకి చెందిన జ్యోతి జాంగ్రా, పీఆర్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఏఆర్ హేమంత్ (కర్ణాటక), జ్యూరీ స్పెషల్ అవార్డులను హర్షిత్ రాతోడ్, జ్యోతి యాదవ్, హరికిషన్ శర్మ, ఎన్ సుంద్రేశా సుబ్రమణియన్, శంభునాథ్, రాజ్ శ్రీ సాహూ, అభిషేక్ యాదవ్, జ్యోతిస్మితా నాయక్, సురభి సింగ్, శుభమ్ తివారీలు గెలిచారు. 

కాగా, ప్రొఫెసర్ గీతా బమేజాయ్, అనితా కౌల్ బసు, ప్రకాశ్ పాత్ర, సముద్ర గుప్తా, కశ్యప్, అనురాగ్ వాజ్‌పేయి‌లను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమాలకు ఐఐఎంసీఏ ప్రెసిడెంట్ కల్యాణ్ రంజన్ అధ్యక్షత వహించగా.. రాజేంద్ర కటారియా, సునీల్ మీనన్, సిమ్రట్ గులాటీ, నితిన్ ప్రధాన్, గాయత్రి శ్రీవాస్తవ, నితిన్ మంత్రి, ఓం ప్రకాశ్, యశ్వంత్ దేశ్‌ముఖ్, ఇతరులు ప్రసంగించారు.