కేరళలో మీడియా సంస్థలు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తలు రాస్తే ఆ జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. విమానయాన సంస్థలు తమ నిబంధనలు అమలు చేసినా వారి వాహనాలను ప్రభుత్వం జప్తు చేస్తోందని ఆరోపించారు.
కేరళ ప్రభుత్వాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే, విమర్శిస్తే వారిపై దాడులు జరుగుతాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. పినరయి విజయన్ పాలనలో ఏ మీడియా సంస్థ అయిన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాస్తే ఆ జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ లు దాఖలు అవుతాయని చెప్పారు. అలాగే వారి ఆస్తులపై హింసాత్మకంగా దాడి జరుగుతుందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు.
మావోయిస్ట్ జోన్ లో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై హత్యాచారం.. గొంతుకోసి, నగ్నంగా మృతదేహం..
కేరళలో విమానయాన సంస్థలు నిబంధనలను అమలు చేయానికి ప్రయత్నించినా వారికి సంబంధించిన వాహనాలు జప్తు అవుతున్నాయని అన్నారు. ఎంపీ, జర్నలిస్ట్ అయిన జాన్ బ్రిట్టాస్ ట్విట్టర్ లో ఓ చేసిన ఓ పోస్ట్ ను రీ ట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ‘గార్డియన్’ లో ఓ కాలమిస్ట్ బ్రిటన్ లో జరుగుతున్న రాజకీయాలపై ఓ కథనం రాశారని, అలాంటి కథనాలు ఇండియాలో చూడగలమా అని జాన్ బ్రిట్టాస్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి స్పందిస్తూ రాజీవ్ చంద్రశేఖర్ ఈ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (PDP) బిల్లుపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఆ బిల్లును ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని, తదుపరి సంప్రదింపులు జరగబోవని చెప్పారు. ‘‘ PDP బిల్లు ఇప్పటికే సంప్రదింపులు జరిగాయి. అది పార్లమెంటరీ కమిటీకి వెళ్లింది. వారు దానిని ఆమోదించిన తర్వాత అది మా వద్దకు తిరిగి వస్తుంది. ఇప్పుడు దానిని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది” అని కాన్‌స్టెలర్ నిర్వహించిన ఫిన్‌టెక్ ఫెస్టివల్ ఇండియా సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ ‘ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్’ తో తెలిపారు.
