Asianet News TeluguAsianet News Telugu

Anand Mahindra : ‘వ్యాక్సిన్ ఒలింపిక్స్’ ఉంటే బంగారు పతకం, ప్రపంచరికార్డ్ మనదే...

అంతేకాదు ఒకవేళ 'వ్యాక్సిన్ ఒలింపిక్' ఉంటే, దీంట్లో భారతదేశం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంటుందని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. 

If there was a Vaccine Olympics, India would be on top : Anand Mahindra after vaccination record
Author
Hyderabad, First Published Sep 18, 2021, 10:27 AM IST

న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయడం ద్వారా మహమ్మారి కరోనావైరస్ తో పోరాటం చేయడానికి ప్రపంచం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ పోరాటంలో అన్ని దేశాలకంటే భారత్ ముందంజలో ఉంది. టీకా డ్రైవ్ లో ప్రపంచంలోనే టాప్ గా నిలిచింది. సెప్టెంబర్ 17 న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఒకే రోజు 2.50 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చి చరిత్ర సృష్టిస్తోంది.

ఈ టీకా డ్రైవ్ ప్రపంచ రికార్డుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో స్పందించారు. ఒకేరోజు 2.50 కోట్లకు పైగా టీకా డోస్‌లను అందించడం కరోనా మహమ్మారి మీద భారత్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. దీని మీద తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

పెళ్లాం ఊరెళితే.. : ప్రియురాలితో ఇంట్లోనే జల్సా... భార్య సడెన్ ఎంట్రీతో షాక్... ట్విస్ట్ ఏంటంటే...

అంతేకాదు ఒకవేళ 'వ్యాక్సిన్ ఒలింపిక్' ఉంటే, దీంట్లో భారతదేశం బంగారు పతకాన్ని కైవసం చేసుకుంటుందని ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. కోవిన్ పోర్టల్ స్క్రీన్‌షాట్ ను షేర్ చేస్తూ.. “కొంతకాలం క్రితం, మనం ప్రతి మూడు రోజులకు.. ఆస్ట్రేలియా జనాభాకు సమానమైన టీకాలు వేస్తున్నామని గమనించాను. అయితే... నిన్న, ఒక రోజులోనే ఆస్ట్రేలియా జనాభాతో సమానమైన టీకాలు వేశాం. 'వ్యాక్సిన్ ఒలింపిక్స్' ఉంటే, మనం బంగారు పతకం సాధించేవాళ్లం. దీంతో పాటు కొత్త ప్రపంచ రికార్డుతో నెలకొల్పేవాళ్లం " అని సంతోషం వ్యక్తం చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios