న్యూఢిల్లీ:

న్యూఢిల్లీ:మీలా ఆలోచిస్తే   రామ మందిరం సమస్య ఇంకా అలానే కొనసాగేదని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.  గురువారం నాడు  రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను మోడీ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా తన ప్రసంగంలో విపక్షాలపై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు. . ఈశాన్య రాష్ట్రాల్లో ఓటు రాజకీయాలు చేయలేదన్నారు మోడీ.ట్రిపుల్ తలాక్ పేరుతో ముస్లిం మహిళలను భయపెట్టారని ప్రధాని విపక్షాలపై మండిపడ్డారు.  సవాళ్లపై వెనుకడుగు వేస్తే అలానే ఉండిపోతామని మోడీ అభిప్రాయపడ్డారు.

 మా ఐదేళ్ల పాలనను మెచ్చి ప్రజలు మళ్లీ పట్టం కట్టారని ప్రధానమంత్రి చెప్పారు. 13 కోట్ల పేదల ఇళ్లలో గ్యాస్ వెలుగులు నింపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  ఈశాన్య రాష్ట్రాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదన్నారాయన. 

ఐదేళ్లలో ఢిల్లీని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గర చేసినట్టుగా ఆయన విపక్షాలకు వివరించారు. రాష్ట్రపతి ప్రసంగం నవీన భారతాన్ని ఆవిష్కరించిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని చెప్పారు.