Asianet News TeluguAsianet News Telugu

గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని

గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే తాను చంపేదాన్నని హిందూ కోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే వ్యాఖ్యానించారు. ఒక న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

If not Godse, I would have killed Gandhi, says judge of self-styled Hindu court
Author
Meerut, First Published Aug 24, 2018, 10:26 AM IST

న్యూఢిల్లీ: గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే తాను చంపేదాన్నని హిందూ కోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే వ్యాఖ్యానించారు. ఒక న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అఖిల భారత హిందూ మహాసభ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ లో తనంత తాను హిందూ కోర్టును ఏర్పాటు చేసినట్లు ప్రకటించుకుంది. కోర్టుకు పూజను న్యాయమార్తిగా నియమించినట్లు కూడా చెప్పుకుంది. 

ఇప్పటికైనా సరే దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే, అడ్డుకునే గాడ్సే ఒకరుంటారని, నాథూరామ్‌ గాడ్సేను తాను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తున్నానని ఆమె అన్నది. గాంధీని గాడ్సే చంపలేదని, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారని, అందరూ అసలు చరిత్ర చదవాలని ఆమె వివరించారు. 

 ట్రిపుల్‌ తలాక్‌ పేరుతో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూధర్మాన్ని అనుసరించాలని గతంలో పూజ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios