విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి శనివారం శ్రీనగర్ కు చేరుకున్నారు. పలు పార్టీల నాయకులను మద్దతు అడిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను రాష్ట్రపతిగా ఎన్నికైతే కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. 

తాను రాష్ట్ర‌ప‌తిగా ఎన్న‌కైతే కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ప్రతిపక్ష రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. జూలై 18న జరగనున్న ఎన్నికల్లో త‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డంలో భాగంగా ఆయ‌న శ‌నివారం శ్రీనగర్ కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. 

Amartya Sen: నోబెల్ గ్రహీత, ప్ర‌ముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కు క‌రోనా పాజిటివ్

‘‘ ఎన్నికైతే కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని కోరుతాను. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్యం, సాధారణ స్థితిని పునరుద్ధరించాలని చెబుతాను. జమ్మూ, కాశ్మీర్ పట్ల విద్వేషపూరిత అభివృద్ధిని అంతం చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం నా ప్రాధాన్యతలలో ఒకటి ’’ అని యశ్వంత్ సిన్హా తెలిపారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. 

Scroll to load tweet…

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎంలు ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై ప్రశంసలు కురిపించిన సిన్హా, దేశంలో ఈ ఇద్దరు నేతల కంటే గొప్ప దేశభక్తులు లేరని అన్నారు. ఫరూఖ్ సాహబ్, మెహబూబాతో పాటు ఇక్క‌డ ఉన్న ప్రజలందరిలో వారే పెద్ద దేశ భ‌క్తుల‌ని అన్నారు. వాళ్ల‌కు దేశ భ‌క్తి లేద‌ని అనుకుంటే, మ‌న‌లో ఎవ‌రికీ దేశభక్తిని చెప్పుకునే హక్కు లేద‌ని అన్నారు. 

లవర్‌తో మాల్దీవ్‌‌లో ఎంజాయ్.. భార్యకు తెలియకూడదని చేసిన పనికి జైలుపాలయ్యాడు!

భారత ఎన్నికల సంఘం 16వ రాష్ట్రపతి ప‌ద‌వికి జూలై 18న తేదీన ఎన్నికలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అయితే అవసరమైతే ఓట్ల లెక్కింపు జూలై 21న నిర్వహించాల‌ని భావిస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ వారసుడిని ఎన్నుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎల‌క్ట్రోర‌ల్ కాలేజీ ద్వారా మొత్తం 4,809 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుంది. కొత్త‌గా ఎన్నికైన రాష్ట్ర‌ప‌తి జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా కేంద్రంలో ఉన్న అధికార ఎన్డీఏ త‌రుఫున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ ద్రౌప‌ది ముర్ము పోటీలో ఉన్నారు.