Bijapur: ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని రాయ్ పూర్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Chhattisgarh IED blast: ఛత్తీస్‌గఢ్‌ లోని బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ 85 బెటాలియన్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని రాయ్ పూర్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో సోమవారం జరిగిన పేలుడులో 85 బెటాలియన్ కు చెందిన ఇద్దరు సీఆర్ పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరు జవాన్లను జిల్లా ఆసుపత్రికి తరలించి తదుపరి వైద్య సహాయం కోసం రాయ్ పూర్ కు తరలించారు. "బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ 85బీఎన్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డార‌నీ, ప్రాథమిక చికిత్స అనంతరం వారిని రాయ్ పూర్ కు తరలిస్తున్నామని" ఛత్తీస్ గఢ్ పోలీసులు తెలిపారు.

Scroll to load tweet…

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేశామ‌నీ, విచార‌ణ కొన‌సాగుతున్న‌ద‌ని పేర్కొన్నారు. ఈ కేసు గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంద‌ని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వ‌ర్ష‌ తెలిపారు. కాగా, ఏప్రిల్ లో ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన ఐఈడీ పేలుడులో పది మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ మరణించారు. ఇటీవ‌ల జ‌రిగిన అతిపెద్ద న‌క్స‌ల్స్ దాడిగా ఈ ఘ‌ట‌న నిలిచింది. రాష్ట్ర పోలీసు జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా అరన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.