న్యూఢిల్లీ: రాజీవ్ గాంధీ కుటుంబం లక్ష్యద్వీప్‌ల్లో సెలవుల్లో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. తండ్రి తరహాలోనే రాహుల్ కూడ ఇదే ప్రాంతంలో స్నేహితులతో కలిసి ఉల్లాసంగా గడిపారు.లక్ష్యద్వీప్‌ల్లోని  బంగారం ద్వీపంలో ఈ కుటుంబం కొన్ని సమయాల్లో ఈ ప్రాంతంలో సేద తీరినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. 

 

లక్ష్యద్వీప్‌లో  బంగారం ద్వీపం ఉంటుంది. ఇది 0.5 స్వ్కేర్ కి.మీ.లలో విస్తరించి ఉంటుంది. లక్ష్యద్వీప్‌ల్లో సుమారు 36 ద్వీపాలు ఉంటాయి. వీటిల్లో సుమారు 44 వేల జనాభా ఉంటుంది. 

ఈ ద్వీపంలో విదేశీయులకు మాత్రం నిషేధం లేదు.  లక్ష్యద్వీప్‌ల్లో ఉన్న ద్వీపాల్లో ఈ ద్వీపంలో మాత్రమే విదేశీయులకు మాత్రం నిషేధం విధించలేదు.  బంగారం ద్వీపం ప్రకృతిపరంగా సెక్యూరిటీని ఇచ్చే ప్రాంతంగా లక్ష్యద్వీప్ పోలీస్ చీఫ్ పి.ఎన్ . అగర్వాల్ చెప్పారు.

లక్ష్యద్వీప్ ప్రాంతంలో రాజీవ్ గాంధీ తనయుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ తన నలుగురు స్నేహితులతో కలిసి డిసెంబర్ 26వ తేదీన బస చేశారు. రాహుల్  తన స్నేహితులతో కలిసి వచ్చిన సమయంలో ఆయన ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను లక్ష్యద్వీప్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకొంది.  

గతంలో ఇదే ప్రాంతంలో రాజీవ్ గాంధీ కూడ  విడిది చేశారు. తన సన్నిహితులతో కలిసి పది రోజుల పాటు ఉన్నారు. ఆ సమయంలో రాహుల్, ప్రియాంకకు చెందిన నలుగురు స్నేహితులతో పాటు  సోనియా గాంధీ సోదరి, ఆమె భర్త, కూతురు కూడ ఈ విందుకు హాజరయ్యారు.  అంతేకాదు సోనియా తల్లితో పాటు మరికొందరు హాజరయ్యారు. 

వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు అమితాబచ్చన్ ఆయన సతీమణి జయాబచ్చన్, వాళ్ల ముగ్గురు పిల్లలు కూడ హాజరయ్యారు. అమితాబ్ సోదరుడి కూతురు అజితాబ్ కూడ వచ్చారు. ఆమె నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మాజీ కేంద్ర మంత్రి అరుణ్ సింగ్  సోదరుడు బిజేంద్ర సింగ్‌తో పాటు ఆయన భార్య కూడ  హాజరయ్యారు.మరో ఇద్దరు విదేశీయులు కూడ ఈ పార్టీకి హాజరయ్యారు.

రాజీవ్, సోనియా గాంధీలు డిసెంబర్ 30, 1987 లో విందును ఇచ్చారు. ఈ విందుకు మరుసటి రోజున అమితాబ్ హాజరయ్యారు. రాజీవ్ గాంధీ ఇచ్చిన విందుకు అమితాబ్ స్టార్ గెస్ట్‌. కానీ, అమితాబ్ భార్య మాత్రం నాలుగు రోజుల ముందుగానే ఈ విందుకు హాజరయ్యారు.

అయితే తన ఇటలీకి చెందిన బంధువులతో రాజీవ్ గాంధీ ఇచ్చిన విందుకు కూడ అమితాబ్ హాజరయ్యాడు. అయితే ఆ సమయంలో అమితాబ్‌  ఆస్తుల కేసుపై దుమారం చెలరేగుతుంది.స్విట్జర్లాండ్‌లో ఆస్తుల కేసును విచారిస్తున్న అధికారులకు  రాజీవ్ గాంధీ ఏం సమాధానం చెబుతారనే విమర్శలు కూడ లేకపోలేదు.

వారం రోజుల పాటు రాజీవ్ కుటుంబం చాలా ప్రశాంతంగా గడిపారు. చేపలు పట్టడం, ఈత కొట్టారు. అంతేకాదు ఈ ద్వీపానికి సమీపంలో ఉన్న తిన్నకర, పరలి ద్వీపాలను కూడ చుట్టి వచ్చారు.  బీచ్ పార్టీలు, సంగీతం వింటూ కాలక్షేపం చేశారు. రాహుల్, ప్రియాంకలు నీటిలో చాలా సేపు గడిపారు.

ఆస్తమా కారణంగా సోనియా గాంధీ మాత్రం నీటిలోకి దిగలేదు.  బోట్‌లో ఉంటూనే ద్వీపం అందాలను తిలకించారు.ఆ సమయంలో బోట్‌లో జయాబచ్చన్, సోనియా తల్లి కూడ ఉన్నారు.

1985 నవంబర్ మాసంలో రాజీవ్ గాంధీ ఒక్క రోజంతా  బంగారం ద్వీపంలో గడిపారు. రాజీవ్ గాంధీ ఇద్దరు పిల్లలు రాహుల్, ప్రియాంకలు  లక్ష్యద్వీప్‌లో గడిపిన సమయంలో రూ. 18వేలను ఆ తర్వాత రాజీవ్ చెల్లించారు.

లక్ష్యద్వీప్‌కు చెందిన  సోసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ రిక్రియేషన్, టూరిజమ్  వాటర్ స్పోర్ట్స్ వింగ్  చెల్లించింది. ఈ సోసైటీలోని ఐదుగురు సభ్యులున్నారు. వీరిలో ఇద్దరు వంట మనుషులు కూడ ఉన్నారు. కానీ, మెనూను రాజీవ్ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగత వంట మనిషి పర్యవేక్షించాడు.

ఈ సమయంలో వైన్, మద్యం రాజధాని నుండి తెప్పించారు.  అంతేకాదు సమీపంలోని పౌల్ట్రీల నుండి చికెన్ ‌ను కూడ సమకూర్చారు.  చేపలను  అక్కడే పట్టి ఫ్రెష్‌గా వండారు. దీనికి తోడుగా లక్ష్యద్వీప్‌లో దొరికే బొప్పాయి ,సపోటా,  చిన్న పసుపు రంగు అరటిపండ్లు, జామ పండ్లను కూడ బంగారం ద్వీపానికి పంపారు.

దీనికి తోడు బ్రెడ్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, 300 బాటిల్స్ మినరల్ బాటిల్స్‌ను తరలించారు. వీటి కోసం అయిన ఖర్చును ఆ తర్వాత రాజీవ్‌కు అందించారు. ఇదిలా ఉంటే  విఐపీ హాలిడే సమయంలో  ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అధికారులు గుర్తు చేసుకొన్నారు. బంగారం ద్వీపానికి రాజీవ్‌ను చేర్చడమే తమ పనిగా వారు చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుండి ఆయనే స్వంతంగా తిరిగి వెళ్లారని చెప్పారు.

రాజీవ్ గాంధీ పది రోజుల పాటు అరేబియా సముద్రంలో షికారు చేయడానికి ఇండియాకు చెందిన ఐఎన్ఎస్ విరాట్‌ను ఉపయోగించారని సమాచారం. అయితే ఈ నౌకను ఉపయోగించడంపైనే ప్రస్తుతం విమర్శలు తలెత్తాయి. అంతేకాదు సబ్‌‌మెరైన్ కూడ ఈ సమయంలో ఉందని ప్రచారంలో ఉంది. అదే సమయంలో  శాటిలైట్ లింక్‌ను కూడ ఉపయోగించారని చెబుతారు.

మరోవైపు రాజీవ్ గాంధీ లక్ష్యద్వీప్‌లో గడపడం వల్ల ఈ ప్రాంతానికి టూరిజం పరంగా మంచి డిమాండ్ పెరిగింది.  అంతేకాదు ఈ ప్రాంతాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేయడంతో పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా లక్ష్యద్వీప్ ఎంపీ పీఎం సయీద్ చెప్పారు. టూరిజం ద్వారా ఈ ప్రాంతాన్ని ఆర్ధికంగా అభివృద్ధి చేస్తున్నట్టుగా చెప్పారు.

జనవరి 6వ తేదీన ప్రియాంక గాంధీ గోవాకు వెళ్లారు. ఆమె వెంట విదేశీయులు కూడ వెళ్లారు. ఆ తర్వాత అమితాబ్‌ అదే రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు వెళ్లిపోయారు. 
రాజీవ్ గాంధీ నేవీ హెలికాప్టర్‌లో రాహుల్ తో కలిసి 1988లో తన తొలి షెడ్యూల్ అధికార కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.సోనియా గాంధీ ఆమె బంధువులు చివరగా ఈ ద్వీపాన్ని వదిలివెళ్లారు.