ఉద్యోగులకు 33 శాతం యాజమాన్య హక్కులు: చెన్నై ఐడియాస్2ఐటీ కంపెనీ బంపర్ ఆఫర్
తమిళనాడు రాష్ట్రంలోని ఐడీయాస్2ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
చెన్నై: తమిళనాడు రాష్ట్ర రాజధానిలోని చెన్నైకి చెందిన ఐడియాస్2ఐటీ కంపెనీ గత ఏడాది తన ఉద్యోగులకు 100 మారుతి సుజుకి కార్లను బహుమతిగా ఇచ్చింది.ఈ ఏడాది 50 మంది ఉద్యోగులకు కార్లను ఇవ్వనుంది. మరో వైపు ఉద్యోగులకు కంపెనీలో 33 శాతం ఈక్విటీ వాటాను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఐడియాస్2ఐటీ టెక్నాలజీస్ సంస్థ ఉద్యోగులకు బంపర్ ఆఫర్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వంద మిలియన్లకు పైగా విలువైన ఆవిష్కరణలకు ఈ కంపెనీ పెట్టింది పేరు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు 33 శాతం యాజమాన్య వాటాను పొందే ప్రత్యేకమైన పథకాన్ని ఆ సంస్థ ప్రకటించింది.
ఇప్పటివరకు ఈఎస్‌ఓపీలు, బోనస్, ఇన్సెంటివ్ లు, ప్రాఫిట్ షేరింగ్ లేదా ఇతర స్టాక్ ఆఫ్షన్లకు మాత్రమే పరిమితం చేయబడింది.ఉద్యోగులకు 33 శాతం యాజమాన్య వాటాను కేటాయించడం ద్వారా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ఈ కంపెనీలో మొదటి 50 మంది ఉద్యోగులకు ఈక్విటీని మంజూరు చేస్తుంది.ఆ తర్వాత మరో 100 మంది ఈ ప్రివిలేజ్ ను పొందే అవకాశం ఉంది. 700 మంది ఉద్యోగులున్న ఈ కంపెనీ రానున్న రోజుల్లో అత్యుత్తమ ప్రొడక్ట్ కంపెనీగా అవతరించాలని భావిస్తుంది.
2009లో మురళీ వివేకానందన్ , భవానీ రామన్ ఈ కంపెనీని స్థాపించారు. ఐడియాస్2ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్, ఎరిక్‌సన్, సిమెన్స్, రోకే వంటి కంపెనీలకు స్కేలబుల్ సాఫ్ట్ వేర్ ను అందిస్తుంది. ఈ కంపెనీ ఐడియా స్టేజ్ స్టార్టప్ వ్యవస్థాపకులతో కూడ పనిచేస్తుంది.
భారత దేశంలో తమ కంపెనీని అగ్ర స్థానంలో నిలిపేందుకు గాను ఉద్యోగులను భాగస్వామ్యులుగా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు మురళీ వివేకానందన్ చెప్పారు.
గత ఏడాదిలో ఈ కంపెనీలో పనిచేసే 100 మంది ఉద్యోగులకు మారుతి సుజుకి కార్లను బహుమతిగా అందించింది. అయితే ఈ ఏడాది మరో 50 మందికి ఈ కార్లను అందించాలని నిర్ణయం తీసుకుంది.ఉద్యోగుల యాజమాన్య కార్యక్రమం సంప్రదాయ ఈఎస్ఓపీల కంటే ఈక్విటీ షేరింగ్ స్కీమ్ విభిన్నంగా ఉంటుంది. ఉద్యోగులకు యాజమాన్య హక్కులు కల్పించడం వల్ల కంపెనీ అభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ వార్షిక కార్యక్రమం నిరంతర రివార్డింగ్ కార్యక్రమంగా రూపొందించారు. అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించే ఉద్యోగులను ఈక్విటీ పూల్ లో అవకాశం కల్పించనున్నారు.ఉద్యోగుల ప్రతిభ,అంకిత భావాన్ని గుర్తించి ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించబడింది.
2009లో మురళీ వివేకానందన్, భవానీ వివేకానందన్ ఐడియాస్2ఐటీ సంస్థ ఏర్పాటు చేశారు. 700 మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.ఐడీయాస్2ఐటీ సంస్థ ఒక ప్రపంచ స్థాయి సంస్థగా స్థిరపడింది. అమెరికాలోని డల్లాస్, చెన్నైలోని ప్రధాన కార్యాలయం కూడ ఈ సంస్థకు ఉంది. బెంగుళూరులో కూడ ఈ సంస్థ కార్యాలయం నెలకొల్పారు. ఐడీయాస్2ఐటీ సంస్థ క్లౌడ్ అప్లికేషన్ డెవలప్ మెంట్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ వంటి వాటిల్లో కీలకంగా పనిచేస్తుంది.