కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ఈరోజు (మే 13) ఐసీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించనుంది.

కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE) ఈరోజు (మే 13) ఐసీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://cisce.org/ మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. ఐసీఎస్‌ఈ ఫలితాల‌ను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు వారి ఇండెక్స్ నంబర్, యూఐడీని ఎంటర్ చేయడంతో పాటు స్క్రీన్ మీద కనిపించే క్యాప్చా కోడ్‌ను పూరించాల్సి ఉంటుంది.

ఐసీఎస్‌ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే.. 
>అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
>కుడి ఎగువ మూలలో ఉన్న ‘ఫలితాలు 2023’పై క్లిక్ చేయండి
>అక్కడ ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 
>ఇండెక్స్ నంబర్, యూఐడీ, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి.. షో రిజల్ట్ బటన్‌పై క్లిక్ చేయాలి. 
>అప్పుడు రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని.. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. 

ఐసీఎస్‌ఈ ఫలితాలు ఎస్‌ఎంస్ఎం ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే.. 
విద్యార్థులు వారి ఐసీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవడానికి కింద పేర్కొన్న ఫార్మాట్‌ను అనుసరించి యాక్సెస్ చేసుకోవచ్చు. ICSE స్పేస్ నెంబర్‌ను టైప్ చేసి 09248082883 నెంబర్‌కు పంపాల్సి ఉంటుంది. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు వారి ఫలితాలను పొందుతారు.