Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ బోటులో వంద‌ల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్ 

350 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ శనివారం పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోంది. 

ICG Gujarat ATS Foil Narco terror Bid, Pakistan Boat With Heroin Worth Rs 350 Cr Seized
Author
First Published Oct 8, 2022, 10:28 AM IST

మ‌ద‌క‌ద్ర‌వ్యాల క‌ట్టిడిపై భార‌త భద్ర‌త బలాగాలు ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నాయి. ఏ మాత్రం అనుమానం వ‌చ్చిన.. ఎవ‌రినైనా అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ క్ర‌మంలో గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నిర్వ‌హించిన ఆప‌రేషన్ భారీ విజయం సాధించింది. 

అక్టోబర్ 8న గుజరాత్ ఏటీఎస్, ఇండియన్ కోస్ట్ గార్డ్‌ కలిసి ఓ ఆపరేషన్ చేశాయి. నిఘా వ‌ర్గాల స‌మాచారం మేర‌కు అరేబియా సముద్రంలో పాకిస్థానీ షిప్ ను  అడ్డగించాయి. ఆ ప‌డ‌వ నుంచి 50 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.350 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోంది. పడవను జఖౌ (కచ్)కి తీసుకువస్తున్నారు.

జాతీయ మీడియా కథనాల ప్రకారం..  విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు పాకిస్థాన్ కు చెందిన షిప్ ను  ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజి)  అధికారులు తనిఖీ చేశారు. వారికి 350 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌తో పాకిస్తాన్ చెందిన ఆరుగురు స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.  

ఏడాదిలో ఆరో ఆపరేషన్

విశేషమేమిటంటే.. ఈ సంవత్సరంలో గుజారాత్ ఏటీఎస్ తో ఇండియన్ కోస్ట్ గార్డ్ చేసిన ఆరో ఆపరేషన్ ఇది. అదే సమయంలో గత నెల రోజుల్లో ఇది రెండో విజయం. అంతకుముందు సెప్టెంబర్ 14న పాకిస్థాన్ బోటులో సుమారు రూ.200 కోట్ల విలువైన 40 కిలోల హెరాయిన్ పట్టుబడింది.

Follow Us:
Download App:
  • android
  • ios