దసరా శరన్నవరాత్రులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దుర్గా నవరాత్రులను అత్యంత వైభవంగా నిర్వహించడంలో బెంగాల్ మొదటి స్థానంలో ఉంటుంది. 

ప్రతీ ఏటా ఇక్కడ జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో దుర్గా మండపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ తెలిపింది. బంగ్లాదేశ్ కేంద్రంగా కార్యాకలాపాలు నిర్వహించే జమాత్ ఉల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ దాడులకు పాల్పడే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

ప్రధానంగా ఉత్తర బెంగాల్‌లోని జల్‌పైగురి, కూచ్‌బెహర్, అలీపుర్‌దవార్, సిలిగురి ప్రాంతాలకు ముప్పు ఎక్కువగా ఉందని నిఘా సంస్థ తెలిపింది.. ఇప్పటికే కొందరు ముష్కరులు భారత్‌లోకి ప్రవేశించి, కూచ్‌బెహర్ జిల్లాకు చేరుకున్నారని.. ఇంకొందరు వస్తున్నారని వెల్లడించింది.

ఈ నేపథ్యంలో దుర్గాపూజ మందిరాలు, శోభాయాత్ర జరిగే మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా ఐబీ.. బెంగాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 2014లో బురుద్వాస్‌ జిల్లాలో దసరా ఉత్సవాల్లో బాంబు పేలింది. దీని వెనుక జమాత్ ఉల్ ముజాహిదిన్ పాత్ర ఉన్నట్లు తేలింది.