అస్సాంకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అయితే ఆమె తెలంగాణ ఆడపడుచు కావడం గమనార్హం. ఇప్పుడీ తెలంగాణ బిడ్డ గురించి ప్రతీ ఒక్కరూ అబ్బురంగా చెప్పుకుంటున్నారు. ఆమె పేరు కీర్తి జల్లి.. ఇంతకీ ఆమె ఏం చేసింది? ఎందుకు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

కీర్తి జల్లి.. వరంగల్ కు చెందిన తెలంగాణ బిడ్డ.. నిబద్ధత కలిగిన ఐ.ఏ.ఎస్.అధికారి. ప్రస్తుతం అసోం రాష్ట్రం లోని హైలాకండిజిల్లా కలెక్టర్ గా పనిచేస్తుంది. ఆసోం రాష్ట్రాన్ని వరదలు ముంచెతుత్తున్నాయి. ప్రజా జీవితం అతలాకుతలం అవుతోంది. ఈ సమయంలో కలెక్టర్ గా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఊరుకోలేదామె.. తానే స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించారు. చాలా సింపుల్ గా చీరకట్టులో.. బురదలో సైతం నడుస్తూ.. బాధితుల దగ్గరికి వెళ్లి వారితో కలిసిపోయి.. వారి కష్టాలు విన్నారు. వారికి కలిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తానే స్వయంగా సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంది. 

"నా గురించి నేను కాదు నా పని మాట్లాడాలి" అని చెప్పే కీర్తి 2013 లో సివిల్స్ లో 89 వ ర్యాంకు సాధించారు. ఆసోం వరద ప్రాంతాల్లో మట్టి, బురద, నీరు అని చూడకంగా ఈమె అందించిన సేవలు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. 

కీర్తి కుటుంబ నేపథ్యం ఏంటంటే.. 
కీర్తి జెల్లి స్వస్థలం వరంగల్‌. తండ్రి జెల్లి కనకయ్య న్యాయవాది. తల్లి వసంత గృహిణి. 2011లో బి.టెక్ పూర్తి చేసిన కీర్తి తన చిరకాల కోరిక అయిన ఐ.ఏ.ఎస్. ఎంపికను నెరవేర్చుకోవడానికి కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్లింది. రెండేళ్లు కష్టపడిన కీర్తి 2013 లో సివిల్స్ లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకూ, రాష్ట్ర స్తాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఆమె నిరాడంబరత గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మచ్చుకు ఒకటి చూడండి...

గత సంవత్సరం సెప్టెంబర్ 10న అసోంలోని కచోరీజిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన సిల్చార్ లో కొంతమంది ఉన్నతాధికారులకు కలెక్టర్ కీర్తి ఓ మేసెజ్ పంపించింది. మా ఇంట్లో వినాయక పూజ ఉంది రమ్మని అందులో ఆహ్వానించింది. అక్కడికి వెళ్ళాక చూస్తే.. వారికి అక్కడ మరో పాతిక మంది కనిపించారు. అయితే, వచ్చినవారికి అప్పటిదాకా తెలియని విషయం ఏంటంటే.. తాము కేవలం వినాయక పూజకే రాలేదని.. అది కలెక్టర్ గారి పెళ్ళి అర్థమయ్యింది. అంత నిరాడంబరంగా ఆమె పెళ్ళి జరిగిపోయింది. 

అంతేకాదు. ఆమె పెళ్లైనప్పుడు కరోనా సమయం కావడంతో పెళ్ళైన మరుసటిరోజు నుండే కీర్తి మళ్ళీ డ్యూటీలో నిమగ్నం అయిపోయింది. హైదరాబాద్ లో ఉన్న తల్లిదడ్రులు కోవిడ్ తో బాధ పడుతున్నా తాను మాత్రం అసోంలోనే కోవిడ్ సేవల్లో నిమగ్నమైపోయింది. అంతేకాదు గతంలో మరెన్నో విషయాల్లో తన ప్రతిభను కనబరిచి ఎన్నెన్నో ప్రశంసలు అందుకుంది. కీర్తి జెల్లి ప్రచారానికి, ఇంటర్య్వూలకు దూరంగా ఉంటారు. "తన గురించి తాను కాకుండా తన పని మాట్లాడాలని" ఆమె విశ్వాసం.

Scroll to load tweet…