శత్రుదేశపు యుద్ధ విమానాన్ని కూల్చడంతో పాటు శత్రు సైన్యానికి చిక్కినా మొక్కవోని ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను బదిలీ చేశారు.

భద్రతా కారణాల రీత్యా శ్రీనగర్ ఎయిర్‌బేస్‌కు ఆవల ఉన్న ప్రాంతానికి అధికారులు ఆయన్ను బదిలీ చేశారు. మరోవైపు అభినందన్ విధుల్లో చేరడానికి గల పూర్తి సామర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

విమానం కూలిపోతున్న సమయంలో పారాచూట్ సాయంతో అభినందన్ కిందకు దూకడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వాయుసేన నిబంధనల ప్రకారం గాయపడ్డ తరువాత 12 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. ఈ గడువు మే చివరి నాటికి ముగియనుంది.

ఈ క్రమంలో బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసన్ నుంచి అభినందన్‌కు అనుమతి లభించాల్సి ఉంది. ‘‘అభినందన్ పోస్టింగ్ ఆర్డర్ జారీ అయిందని.. ఆయన త్వరలో మరో కొత్త ఎయిర్‌బేస్‌లో బాధ్యతలు చేపడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.