ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ లో ఈ రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ విమానం కుప్పకూలింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ లో ఈ రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ విమానం కుప్పకూలింది. యూపీ రాష్ట్ర రాజధాని లక్నోకి 300కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
గోరఖ్ పూర్ ఎయిర్ బేస్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే హెతింపిర్ ప్రాంతం వద్ద పొలాల్లో కుప్పకూలింది. కాగా..ఈ ప్రమాదం నుంచి పైలెట్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.
గతేడాది ఒక జాగ్వార్ విమానం ప్రమాదానికి గురైంది. గతేడాది జూన్ లో గుజరాత్ లోని కచ్ జిల్లాలో జాగ్వార్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 28, 2019, 2:12 PM IST