న్యూఢిల్లీ: భారత గగనతలంలోకి రెండు చైనా ఆర్మీ హెలికాప్టర్లు దూసుకు వచ్చాయని ఆర్మీ అధికారులు తెలిపారు. తూర్పు లడఖ్‌లోకి చైనా హెలికాప్టర్లు ప్రవేశించడంతో భారత వైమానిక దళం కూడ సుఖోయ్ జెట్ ఫైటర్లను గగనతలంలోకి పంపింది.

 చైనా హెలికాప్టర్లు భారత గగనతలంలోకి ప్రవేశించినట్టుగా ఇండియన్ ఆర్మీ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ఈ ఘటన ఈ నెల 5వ తేదీన చోటు చేసుకొందని తెలిపారు. శిక్షణ కార్యక్రమాల్లో భాగంగానే ఈ ఘటన చోటు చేసుకొందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, నిబంధనల ఉల్లంఘన ఎలాంటివి చోటు చేసుకోలేదన్నారు.

also read:కరోనా రోగులకు ఫవిపిరవిర్ క్లినికల్ ట్రయల్స్: ఇండియాలో మూడో దశకు చేరిన టెస్టులు

ఇటీవల తూర్పు లడాఖ్, ఉత్తర సిక్కింలో లాపాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద భారత్ చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత ఆర్మీ అధికారులు ప్రకటించారు.

ఈ నెల 5న సాయంత్రం తూర్పు లడఖ్ ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంట ఇండియా, చైనా ఆర్మీ బాహా బాహీకి దిగారు. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకొన్న విషయం తెలిసిందే.గతంలో కూడ ఇండియా చైనా సరిహద్దుల వద్ద రెండు దేశాల సైనికులు బాహా బాహీకి దిగారు.