రాజస్ధాన్‌లో భారత వాయుసేనకు చెందిన విమానం ఒకటి కూలిపోయింది. ఆదివారం ఉదయం జోధ్‌పూర్ నుంచి బయలుదేరిన మిగ్-27 యూపీజీ విమానం అక్కడికి 180 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలిపోయింది.

ఆయితే ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న వైమానిక అధికారులు ప్రమాదం గురించి ఆరా తీస్తున్నారు.