ఇరాన్ నుంచి చైనాకు వెళ్లుతున్న విమానం భారత గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత విమానంలో బాంబు ఉన్నట్టు బెదిరింపు వచ్చిందని, ఢిల్లీలో ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వాలని ఎయిర్‌పోర్టు ఏటీసీని కోరారు. టెక్నికల్ కారణాల రీత్యా ఆ విజ్ఞప్తిని తిరస్కరించి జైపూర్‌లో ల్యాండ్ కావాలని ఏటీసీ సూచించింది. భారత వైమానిక దళం ఫ్లైట్‌లు ఆకాశంలోకి దూసుకెళ్లి ఆ ఇరాన్ ఫ్లైట్‌ను క్లోజ్‌గా ఫాలో అయ్యాయి.

న్యూఢిల్లీ: ఇరాన్ నుంచి చైనాకు వెళ్లుతున్న మహన్ ఎయిర్‌లైన్ విమానం భారత గగనతంలోకి వచ్చిననప్పుడు సహాయం కోసం ఢిల్లీ ఎయిర్‌ ట్రాఫిక్ కంట్రోల్‌ (ఏటీసీ)ను కాంటాక్ట్ అయ్యారు. తమ విమానంలో బాంబ్ ఉన్నదని, ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తితో ఢిల్లీ అధికారులు అలర్ట్ అయ్యారు. వైమానిక దళానికి సమాచారం చేరగానే జోద్‌పూర్, పంజాబ్ నుంచి ఐఏఎఫ్ విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. బాంబ్ ఉన్నట్టు చెప్పిన ఆ విమానాన్ని ఫాలో అయ్యాయి. ఆ విమానాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించాయి. అయితే, ఆ ఇరాన్ విమానం భారత గగనతలం దాటి చైనాకు వెళ్లిపోయింది.

ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి బయల్దేరి చైనాలోని గువాంగ్‌జౌకు వెళ్లుతున్న మహాన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఏటీసీని ఈ రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో కాంటాక్ట్ అయింది. తమ విమానంలో బాంబు ఉన్నట్టు తమకు బెదిరింపులు వచ్చాయని విమాన సిబ్బంది ఢిల్లీ ఏటీసీ అధికారులకు తెలిపారు. కాబట్టి, ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతించాలని కోరారు. కానీ, సాంకేతిక కారణాలతో అది వీలుపడదని, జైపూర్‌లో ల్యాండ్ కావాలని ఏటీసీ అధికారులు సదరు విమాన సిబ్బందికి సూచనలు చేశారు. కానీ, ఆ ఇరాన్ విమాన పైలట్లు ఈ సూచనలను ఖాతరు చేయలేదు. ముందుకే సాగారు. ఈ సమాచారం తెలియగనే గ్రౌండ్ ఫోర్సెస్ అలర్ట్ అయ్యాయి.

Scroll to load tweet…

రెండు సు-30ఎంకేఐ ఫైటర్ జెట్లు ఆ విమానాన్ని పట్టుకోవడానికి దూసుకెళ్లినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. అయితే, బాంబు థ్రెట్‌కు సంబంధించిన వివరాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఆ విమానం దాని గమ్యం వైపు వెళ్లడానికి అనుమతులు ఇచ్చారు. కానీ, ఆ ప్లేన్‌ను సెక్యురిటీ ఏజెన్సీలు క్లోజ్‌గా అబ్జర్వ్ చేశారు. అన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన అన్ని ఏవియేషన్ యూనిట్లలోని ఎయిర్ స్టేషన్‌లు అలర్ట్ అయ్యాయి. ఆ విమానం చైనాకు వెళ్లుతుండగా మానిటర్ చేశాయి.

ఆ ఇరాన్ విమానం వెనుకాల సేఫ్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తూ ఐఏఎఫ్ జెట్లు వెళ్లాయి. ఆ బాంబు ముప్పును పరిగణనలోకి తీసుకోవద్దని ఇరాన్ అధికారుల నుంచి సూచనలు వచ్చిన తర్వాత ఆ ఫ్లైట్ చైనా వైపు వెళ్లడానికి అనుమతించామని టాప్ ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. భారత గగనతలం దాటి వెళ్లే వరకు ఆ విమానాన్ని తాము ఫాలో అయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ఎయిర్‌క్రాఫ్ట్ భారత గగనతలం దాటి వెళ్లిపోయిందని తెలిపారు.

అంతేకాదు, జైపూర్ లేదా చండీగడ్‌లో ల్యాండ్ కావడానికి అవకాశాలు ఇచ్చినా ఇరాన్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు ఆ అవకాశాలను స్వీకరించలేదని వారు చెప్పారు.

ఈ ఇరాన్ ఫ్లైట్ (W581) చైనాలో సకాలంలో సేఫ్‌గా ల్యాండ్ అయిందని మహన్ ఎయిర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.