శత్రుమూకలను తరిమి కొట్టడంతో పాటు సేవా భావంలోనూ భారత సైన్యం నెంబర్ వనే అని నిరూపించింది. తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన సహచరుడి సోదరి పెళ్లిని చేశారు జవాన్లు.

వివరాల్లోకి వెళితే.. హర్యానా రోహ్‌తక్ జిల్లాకు చెందిన జ్యోతి ప్రకాశ్ ఎయిర్‌ఫోర్స్ గార్డు యూనిట్ కమాండోగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఆయన సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అశోక చక్ర ప్రకటించింది. ప్రకాశ్ తండ్రి తేజ్ నారాయణ్ సింగ్‌కు మరో ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమార్తె శశికళ పెళ్లీడుకు రావడం, సోదరుడు ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబానికి 50 మంది ఎయిర్‌ఫోర్స్ కమాండోలు అండగా నిలబడ్డారు.

సొంత అన్నయ్య అభిష్టానికి అనుగుణంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. తలో చేయ్యి వేసి రూ. 5 లక్షలు పొగు చేశారు. పెళ్లికి రెండ్రోజుల ముందే వచ్చి ఏర్పాట్లు చేసి వివాహా వేడుకను పర్యవేక్షించారు. ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తారింటి కి పంపారు.