లక్నో: భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పొలాల్లో దిగింది.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని షహరాపూర్ లోని వ్యవసాయ పొలాల్లో భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ దిగింది.

గురువారం నాడు మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకొంది. భారత వాయుసేనకు చెందిన  ధృవ్ హెలికాప్టర్  దిగింది. ఈ హెలికాప్టర్ పొలాల్లో దిగిందనే విషయాన్ని తెలుసుకొన్న స్థానికులు పెద్ద ఎత్తున హెలికాప్టర్ ను చూసేందుకు వచ్చారు.భారత వైమానిక దళం నిర్వహించే సాధరణ శిక్షణ కార్యక్రమంలో భాగంగానే ఈ హెలికాప్టర్ పొలాల్లో దిగిందని ప్రాథమికంగా అందిందని అధికారులు ప్రకటించారు.

భారత వైమానిక దళం ఈ రోజు తన 88వ వార్షికోత్సవాన్ని జరుపుకొంటుంది. ఈ సందర్భంగా పలు యుద్ధ విమానాలతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో ప్రదాన ఆకర్షణగా మారనున్నాయి.ఢిల్లీకి సమీపంలోని హిండన్ వద్ద ఉన్న వైమానిక దళానికి చెందిన స్టేషన్ లో ఈ కార్యక్రమం సాగింది.