న్యూఢిల్లీ: అమెరికాలోని  హావాయి పీరల్ హార్బర్ వద్ద బుధవారం నాడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు గాయాపడ్డారు. ఈ సమయంలో భారత వైమానిక దళ చీఫ్ మార్షల్ ఆర్‌కెఎస్ బండారియా సురక్షితంగా బయటపడ్డాడు.

భారత వైమానిక చీఫ్ మార్షల్ సహా ఇతర వైమానిక సిబ్బంది ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోని ఓ సదస్సులో పాల్గొనేందుకు భారత వైమానిక చీఫ్ మార్షల్ తో పాటు వైమానిక సిబ్బంది పాల్గొనేందుకు  హావాయికి చేరుకొన్నారు.పీఎసీఎస్-2019  సమావేశం ఈ కాల్పులు జరిగిన మరో వైపు జరిగింది. ఈ ఘటనలో  ముగ్గురు గాయపడినట్టుగా అమెరికా నేవీ అధికారులు ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్నట్టుగా అమెరికా అధికారులు ప్రకటించారు.హావాయి స్టాండర్డ్ సమయం రెండున్నర గంటలకు ఈ ఘటన  చోటు చేసుకొందని అమెరికా అధికారులు తెలిపారు.