Asianet News TeluguAsianet News Telugu

ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో... అఫ్గాన్ నుంచి గుజరాత్ కి చేరుకున్న భారత అధికారులు

ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని గుజరాత్ కి సురక్షితంగా తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

IAF aircraft carrying Indian officials lands in Gujarat's Jamnagar
Author
Hyderabad, First Published Aug 17, 2021, 1:06 PM IST

ఆప్ఘనిస్తాన్ లో పరిస్థితి రోజు రోజుకీ దారుణంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ ని తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో..  కాబూల్ లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు.  అక్కడి పరిస్థితులు  సరిగాలేకపోవడంతో.. భారతీయ అధికారులను ప్రత్యేక విమానంలో.. భారత్ కి తరలించారు.

ఇప్పటికే భారత రాయబారి సహాయ ఎంబసీ సిబ్బందిని స్వదేశానికి తరలించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థదితుల దృష్ట్యా కాబూల్ లోని కాబూల్‌లోని భారత రాయబారి సహా ఎంబసీ సిబ్బంది, భద్రతా విభాగాల అధికారులను వెంటనే తరలించాలని నిర్ణయించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరందమ్ బగ్చీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో వీరిని తరలించారు.

ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ లో వారిని గుజరాత్ కి సురక్షితంగా తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ఆ దేశంలో ఉన్న భారతీయులందరినీ స్వదేశానికి తీసుకురావాలని.. ప్రభుత్వం  యోచిస్తోంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 

 

మొత్తం 120 మంది అధికారులు, సిబ్బంది మొత్తం కలిపి 140 మందిని వాయిసేన సీ-17 విమానంలో కాబూల్ నుంచి తీసుకువచ్చారు.  ఎంబసీకి చెందిన కీలక పత్రాలను కూడా భద్రతంగా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios