రాష్ట్రపతి పదవికి యుద్ధం సాగుతున్నందున తాను ఈ యుద్ధంలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా విపక్ష పార్టీల తరపున రాష్ట్రపతి పదవికి బరిలోకి దిగుతున్న యశ్వంత్ సిన్హా చెప్పారు. యశ్వంత్ సిన్హా ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ: విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి తనను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి Yashwant Sinha చెప్పారు. సోమవారం నాడు President పదవికి విపక్ష పార్టీల అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా Nomination దాఖలు చేశారు. అనంతరం న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
విపక్షాల తరపున తాను నాలుగో అభ్యర్ధిగా చెబుతున్నారు. తాను 10వ నెంబర్ లో ఉన్నా కూడా ఒక్క విషయం మాత్రం స్పష్టం చేయదల్చుకొన్నానన్నారు. ఇది పెద్ద యుద్దం అందుకే తాను ఈ యుద్ధ:లో పాల్గొనేందుకు అంగీకరించినట్టుగా చెప్పారు యశ్వంత్ సిన్హా.
ఈ నెల 29 నుండి యశ్వంత్ సిన్హా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం నుండి ఎన్నికల ప్రచారాన్ని యశ్వంత్ సిన్హా ప్రారంభించే అవకాశం ఉంది.కేరళ నుండి తమిళనాడుకు వెళ్లనున్నారు. అక్కడి నుండి జూలై 1న గుజరాత్ కు, జూలై 2న కర్ణాటకకు సిన్హా వెళ్లనున్నారు.
