చెన్నై:ఎఐడీఎంకె నుండి బహిష్కరణకు గురైన  దివంగత మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ సోమవారం నాడు చెన్నైకి వచ్చారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత తొలిసారిగా ఆమె చెన్నైలో అడుగుపెట్టారు. శశికళకు ఆమె అభిమానులు భారీగా స్వాగతం పలికారు.

ఎఐఏడీఎంకె గుర్తు ఉన్న  కారులోనే ఆమె ప్రయాణీంచారు. తాను ప్రయాణిస్తున్న కారుకు ఎఐఏడీఎంకె గుర్తు ఉన్న జెండాను ఏర్పాటు చేసుకోవడంపై పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 
అయినా లెక్క చేయకుండా ఆమె మరో కారులో ప్రయాణించారు. ఆ కారుకు కూడ పార్టీ జెండా ఉంది.

ఆమె చెన్నై చేరుకోవడానికి కొన్ని గంటల ముందు తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన మద్దతుదారులతో ఆమె మాట్లాడారు. యుద్దభూమికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు.తాను కచ్చితంగా రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటానని ఆమె  చెప్పారు. జయలలిత స్మారక చిహ్నం ఎందుకు తొందరగా మూసివేయబడిందో తమిళనాడు ప్రజలకు తెలుసునని ఆయన చెప్పారు. 

తాను ఎఐడీఎంకె ప్రధాన కార్యాలయానికి వెళ్తానా అని ఓపికగా వేచి ఉండాలని ఆమె కోరారు.అందరం ఐక్యతతో పనిచేయాలన్నారు. పార్టీ గతంలో అనేక అడ్డంకులను ఎదుర్కొందన్నారు. తాను  మీ అభిమానానికి బానిసను అని ఆయన చెప్పారు.ఈ ఏడాది పరప్పర ఆగ్రహార జైలు నుండి శశికళ విడుదలయ్యారు. ఇవాళ ఉదయం ఆమె బెంగుళూరు నుండి చెన్నైకి చేరుకొంది.