ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతును కొనసాగిస్తానని సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్న రైతుల ఉద్యమానికి మద్దతును కొనసాగిస్తానని సామాజిక కార్యకర్త గ్రెటా థంబర్గ్ స్పష్టం చేశారు.ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు చేస్తూ చేసిన ట్వీట్లతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారనే నెపంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు.
ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే గ్రెటా థంబర్గ్ మరోసారి గ్రెటా థంబర్గ్ ట్విట్టర్ వేదికగా గురువారం నాడు స్పందించారు. రైతుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పారు.శాంతియుత నిరసనలకు తన మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
also read:రైతు ఉద్యమానికి మద్దతు: గ్రెటా థంబర్గ్‌పై కేసు
ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతు పేరుతో గ్రెటా థంబర్గ్ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. ఆమె రైతులను రెచ్చగొట్టేలా ట్వీట్ చేసిందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసిన కొద్దిసేపటికే ఆమె మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి
విదేశాలకు చెందిన ప్రముఖులు రైతు ఉద్యమాలపై స్పందిస్తున్నారు. రైతులకు మద్దతును ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియా తీవ్రంగానే స్పందించింది.
