ప్రధాని మోడీ, బిహార్ సీఎంలకు రాజకీయాలు చేసే పిల్లలు పుట్టుగాక అని ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు. సీఎం నితీష్ కుమార్, పీఎం మోడీలకు పిల్లలు లేకుంటే నేనేం చేసేదీ? నితీష్ కుమార్‌కు ఒక కొడుకు ఉన్నాడు. కానీ, ఆయన రాజకీయాలకు ఫిట్ కాదు. దానికి నేనేం చేయాలి? వీరిద్దరికీ రాజకీయాలు చేయడానికి పనికి వచ్చే పిల్లలు పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని తెలిపారు. ప్రధాని మోడీ వంశపాలనపై చేసిన వ్యాఖ్యల తర్వాత లాలు ఈ మాటలు అన్నారు. 

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్(Lalu Prasad yadav).. ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi), బిహార్ సీఎం నితీష్ కుమార్‌(BIhar CM Nitish Kumar)లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశవాదంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ, సీఎం నితీష్ కుమార్‌లకు పిల్లలు పుట్టుగాక అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ వంశపాలనపై వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఈ మాటలు అన్నారు. వంశపాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ప్రధాని మోడీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూల పేర్కొన్నారు.

‘సీఎం నితీష్ కుమార్, పీఎం మోడీలకు పిల్లలు లేకుంటే నేనేం చేసేదీ? నితీష్ కుమార్‌కు ఒక కొడుకు ఉన్నాడు. కానీ, ఆయన రాజకీయాలకు ఫిట్ కాదు. దానికి నేనేం చేయాలి? వీరిద్దరికీ రాజకీయాలు చేయడానికి పనికి వచ్చే పిల్లలు పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. తద్వార వంశపారంపర్యంపై వారికీ అవగాహన ఉంటుంది’ అంటూ లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.

అంతకు ముందు అంటే బుధవారం ప్రధాని మోడీ ఓ మీడియాతో మాట్లాడుతూ.. తన జీవితమంతా కేవలం సమాజానికేనని అన్నారు. నేను నకిలీ సామ్యవాదం అంటే.. అది వంశపారంపర్యం గురించి ఉపయోగించిన మాటగా అర్థం చేసుకోవాలి అని తెలిపారు. లోహియా కుటుంబ సభ్యులను మీరు చూడగలరా అని అడిగారు. ఆయన ఒక సామ్యవాది అని వివరించారు. అలాగే, జార్జ్ ఫెర్నాండేజ్ కుటుంబ సభ్యులను మీరు చూస్తున్నారా? అని అడిగారు. ఆయన ఒక సమాజ్‌వాదీ అని పేర్కొన్నారు. నితీష్ కుమార్ తమతో ఉన్నాడని తెలిపారు. ఆయన కూడా ఒక సోషలిస్ట్ అని వివరించారు. ఎందుకంటే.. ఆయన కుటుంబాన్ని మీరు ఎక్కడైనా రాజకీయాల్లో చూశారా? అంటూ ప్రశ్నించారు.

ఒక పార్టీ తరతాలుగా ఒక కుటుంబ నిర్వహణలో ఉన్నదంటే.. అది వంశపాలన అని ప్రధాని మోడీ అన్నారు. మీరు జమ్ము కశ్మీర్‌ను తీసుకున్నా అక్కడ రెండు కుటుంబాలు నడుపుతున్న రెండు పార్టీలు ఉన్నాయని వివరించారు. అదే తీరును మీరు హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులోనూ కనిపిస్తుందని తెలిపారు. వంశపాలన ప్రజాస్వామ్యానికి అతి పెద్ద సమస్య అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, గతేడాది నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తనదైన స్టైల్లో స్పందించారు. సుంకాన్ని తగ్గించడం వల్ల ప్రజలకు ఎలాంటి ఉపశమనం కలగదని.. దానిని రూ.50 వరకు తగ్గిస్తేనే జనానికి మేలని లాలూ అన్నారు. ఇదంతా డ్రామా అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు తగ్గించినట్టు చెప్పినా 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పెంచుతారంటూ ఆయన జోస్యం చెప్పారు. మోడీ ప్రభుత్వం తగ్గించిన ఎక్సైజ్ సుంకం సరిపోదని.. మరింత తగ్గించాలంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు.