శబరిమల అయ్యప్ప స్వామి అసలు దేవుడే కాదని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయంలోకి మహిళను ప్రవేశించడాన్ని అనుమతిస్తూ.. ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. కోర్టు తీర్పును కొందరు అయ్యప్ప భక్తులు సవాల్ చేశారు.ఆలయంలోకి ప్రవేశించడానికి వచ్చిన మహిళలను అడ్డుకోవడానికి కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమలలో ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు కూడా నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్ చేశాడు. ‘‘స్త్రీ అంటే తల్లి. మనం పుడమిని తల్లితో పోలుస్తాం. మనకు జన్మనిచ్చేదీ ఆ మహిళే. మరి అదే మహిళను పూజలకు దూరంగా ఉంచడంలో అర్థం ఏమిటి? మహిళలను ప్రార్థించడానికి అనుమతించని మతం నా దృష్టిలో మతమే కాదు. దైవదర్శనానికి అతివలను అనుమతించని భక్తులు భక్తులే కాదు. తన సన్నిధికి మహిళలను అనుమతించని అయ్యప్ప దేవుడే కాడు.’’ అంటూ కామెంట్ చేశాడు.

కాగా.. ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ పై అయ్యప్ప భక్తులు ఎలా స్పందిస్తారో చూడాలి.