Asianet News TeluguAsianet News Telugu

బీజేపీని నా గురువుగా భావిస్తున్నాను - కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ

బీజేపీని తన గురువుగా భావిస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆ పార్టీ తమకు శిక్షణ ఇస్తోందని తెలిపారు. భారత్ జోడో యాత్ర తలుపులు అందరి కోసం తెరిచే ఉంటాయని అన్నారు. 

I consider BJP as my mentor - Congress leader Rahul Gandhi
Author
First Published Dec 31, 2022, 2:10 PM IST

భారత్ జోడో యాత్రకు దేశ ప్రజల నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వర్కింగ్ స్టైల్‌ని టార్గెట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి భయపడే వ్యక్తి చల్లగా ఉంటారని అన్నారు.

బంగ్లాదేశ్ బార్డర్‌లో బీఎస్ఎఫ్ శునకం ప్రసవం.. దర్యాప్తునకు ఆదేశాలు

‘‘ వారు (బీజేపీ) మాపై దూకుడుగా దాడి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. నేను వారిని (బీజేపీ) నా గురువుగా భావిస్తాను. వారు నాకు మార్గం చూపుతున్నారు. మేము ఎలా చేయకూడదో వారు శిక్షణ ఇస్తున్నారు. ’’ అని ఆయన తెలిపారు.

టైగర్ కిషన్ ఇక లేదు. క్యాన్సర్ తో పోరాడి నవాబ్ వాజిద్ అలీ షా జూలాజికల్ పార్క్ లో మృతి

భారత్ జోడో యాత్రలో ప్రతిపక్షాలు ఐక్యమవుతాయని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందరి కోసం ఈ పాదయాత్ర తలుపులు తెరిచే ఉంటాయని చెప్పారు. మాతో చేరకుండా ఎవరినీ అడ్డుకోబోమన్నారు. అఖిలేష్ యాదవ్, మాయావతి, ఇతరులు మొహబ్బత్ కా హిందుస్తాన్ ను కోరుకుంటున్నారని, మా మధ్య భావజాలానికి కొంత సంబంధం ఉందని ఆయన అన్నారు.

2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీయే ప్రతిపక్ష ప్రధాని అభ్యర్థి - కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్

కాగా.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిసెంబర్ 29న మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 3న ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశించే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ పార్టీ తనను అధికారికంగా ఆహ్వానించలేదని అన్నారు. కానీ తాజాగా రాహుల్ గాంధీ ఆయన పాల్గొనే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. వాస్తవానికి అఖిలేష్ యాదవ్, ఆయన పార్టీ సభ్యులెవరూ ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. గతంలో ఈ యాత్ర వివిధ రాష్ట్రాల్లో కొనసాగింది. అక్కడ బీజేపీయేత పార్టీలు పాల్గొన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఒకరకమైన ప్రతిపక్ష ఐక్యతను చూపించింది. కానీ మూడు రోజుల కిందట అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ భారత్ జోడో యాత్రకు దూరంగా ఉంటుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని.. అవి రెండూ తమ పార్టీ సిద్ధాంతానికి విరుద్దంగా ఉన్నాయని చెప్పారు.

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్: డ్రింక్ అండ్ డ్రైవింగ్ తనిఖీల కోసం 18,000 మంది ఢిల్లీ పోలీసులు

కాగా.. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర దాదాపు 3,000 కిలోమీటర్లు ప్రయాణించింది.  ప్రస్తుతం తొమ్మిది రోజుల శీతాకాల విరామంలో ఢిల్లీలో ఆగిపోయింది. జనవరి 3న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోకి ప్రవేశిస్తూ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios