కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ (Twitter account hacked) అయింది. నేడు (జనవరి 12) ఉదయం ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. పేజీ పేరును టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌గా మార్చారు. 

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting) అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ (Twitter account hacked) అయింది. నేడు (జనవరి 12) ఉదయం ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. పేజీ పేరును టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌గా మార్చారు. అంతేకాకుండా కొన్ని హానికరమైన లింక్‌లను కూడా పోస్ట్ చేశారు. అయితే హ్యాకింగ్‌కు గురైన కొద్దిసేపటికే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ఖాతా పునరుద్దరించబడింది. అనంతరం హ్యాకర్లు పోస్టు చేసిన ట్వీట్లను తొలగించారు. ట్విట్టర్ ఖాతా పునరుద్దరించబడిన విషయాలన్ని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఫాలోవర్స్ సమాచారం కోసం ఈ సమాచారాన్ని తెలియజేసింది. ఇక, ట్విట్టర్‌లో @Mib_india ఖాతాకు 1.4 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. 

సరిగ్గా నెలరోజుల క్రితం డిసెంబరు 12వతేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా కొద్దిసేపు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్‌ చేశారని.. ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని హ్యాకర్లు లింక్‌లను పోస్ట్ చేశారు. అయితే దీనిని పీఎంవో అధికారులు వెంటనే ట్విటర్‌ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ట్విటర్‌ అకౌంట్‌ను రీస్టోర్‌ చేశారు. 

Scroll to load tweet…

ఇక, జనవరి 2వ తేదీన హ్యాకర్లు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్ (ఐసీడబ్ల్యూఏ) అధికారిక ట్విట్టర్ ఖాతాను, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), మైక్రోఫైనాన్స్ బ్యాంక్ అయిన మన్ దేశి మహిళా బ్యాంక్ ట్విట్టర్ ఖాతాలను వారి నియంత్రణలోకి తీసుకున్నారు. వెంటనే ఆ అకౌంట్‌ల పేర్లను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్‌ పేరుగా మార్చారు.