నాకింకా ముసలితనం రాలేదు.. నేను ఇంకా పని చేయగలను - అజిత్ పవర్ కు కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్
తనకు ఇంకా ముసలితనం రాలేదని, ఇప్పుడే రిటైర్డ్ కాబోనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. బీజేపీ ప్రోద్బలంతోనే అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ వంటి తిరుగుబాటు నేతలు తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని ఆయన ఆరోపించారు.
ఇంకా ఎప్పుడు రిటైర్డ్ అవుతారు ? ఇప్పటికే 82 ఏళ్లు వచ్చాయి అని ఇటీవల ఎన్సీపీ తిరుగుబాటు నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత శరద్ పవార్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను 82 ఏళ్ల వయసులోనూ పని చేయగలనని అన్నారు. ఈ మేరకు ఆయన ‘ఇండియా టుడే’తో మాట్లాడుతూ.. తనకు ఇంకా ముసలితనం రాలేదని చెప్పారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి మాటలను గుర్తు చేసుకుంటూ ‘నేను అలసిపోలేదు, రిటైర్ కాలేదు’ అని అన్నారు.
విషాదం.. ప్రియురాలికి వివాహమైందని యువకుడి ఆత్మహత్య.. పెళ్లయిన 3 రోజుల తరువాత నవ వధువు కూడా..
తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని, తనకు ఎలాంటి మంత్రి పదవి లేదని శరద్ పవార్ అన్నారు. తనను రిటైర్ అవ్వమని చెప్పడానికి వారెవరు (అజిత్ పవార్ ను ఉద్దేశించి)? తాను ఇంకా పని చేయగలను అని అన్నారు. తన సమావేశం చట్టవిరుద్ధమన్న అజిత్ పవార్ వర్గం వాదనపై శరద్ పవార్ స్పందిస్తూ.. అయితే తాను చేసిన ప్రఫుల్ పటేల్ సహా పార్టీ నేతల నియామకాలన్నీ కూడా చట్టవిరుద్ధమేనని అన్నారు.
అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్బల్ వంటి తిరుగుబాటు నేతలు తనపై వ్యక్తిగత దూషణలకు దిగారని, అయితే ఇదంతా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రోద్బలంతోనే జరిగిందని ఆయన ఆరోపించారు. ఎన్సీపీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్న అజిత్ పవార్ ఆరోపణలపై శరద్ పవార్ స్పందిస్తూ.. తన సోదరుడి కుమారుడిని తాను నాలుగుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిని చేశారని, ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు ఇప్పించానని అన్నారు.
హింస మధ్య పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. 73,000 స్థానాలకు మొదలైన పోలింగ్
ఎన్నికల్లో ఓడిపోయినా ప్రఫుల్ పటేల్ ను కూడా యూపీఏలో మంత్రిని చేశానని, పీఏ సంగ్మా కుమార్తెను కేంద్రమంత్రిగా నియమించారని తెలిపారు. కానీ సుప్రియ (సూలే)కు ఇంకా ఆ అవకాశం రాలేదని అన్నారు. అజిత్ మాట్లాడేది చాలా తప్పు అని అన్నారు. 2014, 2017, 2019లో సంకీర్ణ ప్రభుత్వం కోసం తమ పార్టీ బీజేపీతో చర్చలు జరిపిందని, అయితే సైద్ధాంతిక విభేదాల కారణంగా కాషాయ పార్టీతో కలిసి ముందుకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు.
అందరి సంతోషం కోసం నిరంతరం తపించారు నాన్న.. మీ స్పూర్తే నన్ను నడిపిస్తోంది - సీఎం వైఎస్ జగన్
పొత్తుపై చర్చలు జరపడంలో తప్పులేదని, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమని ఆయన వాదించారు. శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరాలని అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయంపై శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘శివసేన, బీజేపీ మధ్య వ్యత్యాసం ఉంది. శివసేనతో కలిసి వెళ్లినప్పుడు.. బీజేపీ ఎందుకు వెళ్లకూడదని అజిత్ అనడం తప్పు. ఎమర్జెన్సీ సమయంలో శివసేన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని వారితో కలిసి మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.’ అని గుర్తు చేశారు. కానీ తాము బీజేపీకి వ్యతిరేకమన్నారు.