PM Modiహిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆ వేదికపై నుంచే మోదీ దేశం నలుమూలల్లోని లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అదే సమయంలో కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా 11వ విడత డబ్బులను విడుదల చేశారు.
PM Modi : గడిచిన 8 ఏండ్లలో కనీసం ఒక్కసారి కూడా తనని తాను ప్రధానమంత్రిగా భావించలేదనీ. బాధ్యతల స్వీకార పత్రంపై సంతకం చేసినప్పుడు మాత్రమే తాను ప్రధానిని భావించాననీ.. ఆ మరుక్షణం నుంచి 130 కోట్ల మంది భారతీయులకు ప్రధాన సేవకుడననీ భావించానని, ఈ దేశ ప్రజలే తన సర్వస్వమనీ, తన జీవితం ఈ దేశ కోసమేనని ప్రధాని మోడీ ఉద్వేగపూరిత వ్యాఖ్యాలు చేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ సిమ్లా పర్యటనలో భాగంగా మంగళవారం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లోనూ పాల్గొననారు. ఇప్పటివరకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి స్కీంలో భాగంగా పది విడతలుగా నగదు జమ చేసిన కేంద్రం.. ఈ కార్యక్రమంలో భాగంగా.. నేడు 11వ విడత నగదును విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 10 కోట్లకు పైగా రైతులకు (లబ్ధిదారులకు) పీఎం మోదీ రూ. 21,000 కోట్లకు పైగా డబ్బులను విడుదల చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 2 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
అనంతరం బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కుంభకోణాలు, వారసత్వ రాజకీయాలు, అవినీతి ఉండేవనీ, వాటి గురించే ప్రజలు బాధపడేవారని, దేశం గురించి ఆందోళన చెందేవారిని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనీ,, నేడు కేంద్రం పథకాల వల్ల తమ జీవితాల్లో వచ్చిన, వస్తోన్న మార్పుల గురించే ప్రజలు చర్చించుకుంటున్నారని ప్రధాని అన్నారు. భారత స్టార్టప్ లపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందనీ, భారత్ లో వ్యాపార సులభ నిర్వహణ గురించి ప్రపంచ బ్యాంకు కూడా మాట్లాడుతోందని ప్రధాని అన్నారు.
'గత 8 ఏళ్లలో నేనెప్పుడూ ప్రధానిగా భావించలేదు': మోదీ
ప్రజా సంక్షేమ సదస్సులో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. “గత 8 ఏళ్లలో.. నేను ఒక్కసారి కూడా ప్రధానిననీ భావించలేదు. ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పడు పత్రాలపై సంతకం చేసినప్పుడు మాత్రమే ప్రధానని భావించాను. కానీ, మరుక్షణం నుంచి 130 కోట్ల ప్రజలకు ప్రధాన సేవకుడిగానే పనిచేశాను. వారే నా జీవితం. నా సర్వస్వం వారి కోసమే’ అని అన్నారు.
కేంద్రంలో ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా లో ప్రధాని మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశ సరిహద్దులు 2014కు ముందు కంటే ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉన్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ సహా పలు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని స్వయంగా మాట్లాడారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో.. ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలు తెలుసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రధాని సైతం ఈ కార్యక్రమంలో భాగంగా తాను వెళ్లిన ప్రతి చోటా లద్ధిదారులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.
