Asianet News TeluguAsianet News Telugu

రూ. 3 వేల కోట్ల టెండర్ స్కామ్: మంతెన శ్రీనివాస రాజు అరెస్టు

మంతెన కన్ స్ట్రక్షన్స్ చైర్మన్ శ్రీనివాస రాజు మంతెనను, అతని మిత్రుడు త్రిపాఠీని ఈడీ అధికారులు భోపాల్ లో అరెస్టు చేశారు. ఈ- టెండరింగ్ ను ట్యాంపర్ చేయడం ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు.

Hyderabad bizman Mantena arrested for Rs 3,000 cr tender scam in Mandhya Pradesh
Author
Hyderabad, First Published Jan 21, 2021, 8:00 AM IST

హైదరాబాద్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ టెండరింగ్ కుంభకోణం కేసులో హైదరాబాదుకు చెందిన సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ను, ఆయన అనుచరుడిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరు రూ. 3 వేల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ ఫ్రాడ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. 

మంతెన కన్ స్ట్రక్షన్స్ చైర్మన్ శ్రీనివాస రాజు మంతెనను, ఆయన అసోసియేట్ ఆదిత్య త్రిపాఠిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆదిత్య త్రిపాఠీ ఆర్ని ఇన్ ఫ్రా సంస్థకు చెందినవాడు. భోపాల్ నివాసి. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 

వారిద్దరికి కోర్టు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.మంతెన, త్రిపాఠి పలు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ కంపెనీలతో కలిసి కుట్ర చేశారని, వాటిలో ఎక్కువగా హైదరాబాదుకు చెందినవి ఉన్నాయని ఈడీ అధికారులు అంటున్ారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ కు చెందిన కొంత మంది సీనియర్ అధికారులతో, ఐటి సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి ఈ- టెండర్లను ట్యాంపర్ చేశారని, అక్రమంగా భారీ కాంట్రాక్టులు పొందారని ఈడీ ఆరోపిస్తోంది.

ఎఫ్ఐఆర్ ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్,  బెంగళూరుకు చెందిన అంతరేస్ లిమిటెడ్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ - ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ ను నిర్వహిస్తున్నాయి. పోర్టల్ నిర్వహణ, ఆపరేషన్ కు సంబంధించి ఐదేళ్ల కాంట్రాక్ట్ ఇ్చచారు. 

ఆంతరేస్ ఇచ్చిన లాగిన్ క్రెడిన్షియల్స్ ను ఓస్మో ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వినయ్ చౌదరి, వరణ్ చతుర్వేది దుర్వినియోగం చేసినట్లు ఐపీ యాక్సెస్ లాగ్స్ ద్వారా బయటపడిందని, ఈ - టెండర్స్ ను ట్యాంపర్ చేశారని, కొన్ని కంపెనీల బిడ్ వాల్యూస్ ను మార్చారని ఈడీ అంటోంది. 

దానికి ప్రతిఫలంగా బిడ్డింగ్ కంెపనీల నుంచి వారికి లంచం ముట్టిందని, మాక్స్ మంతెన జేవీ రూ.1,030 కోట్ల రూపాయల టెండర్ ను అక్రమంగా పొందిందని ఈడీ తన ఎఫ్ఐఆర్ లో తెలిపింది. మరిన్ని టెండర్లను పరిశీలిస్తున్నట్లు ఈడీ తెలిపింది.

మంతెన గ్రూప్ హైదరాబాదుకు చెందిన కంపెనీలతో కలిసి లేదా నేరుగా గత కొన్నేళ్లలో బిడ్స్  ను పొందిందని ఈడీ సోదాల్లో తేలింది. నిందితులకు చెందిన, హైదరాబాదు, బెంగళూర్, భోపాల్ నగరాల్లో వారితో సంబంధం ఉన్నవారి 20 ఆవరణల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  డిజిటల్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొందరి వాంగ్మూలాలను రికార్డు చేశారు. 

మొత్తం కుంభకోణంలో మంతెన ప్రధానమైన పాత్రను పోషించినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. తన మిత్రుడు త్రిపాఠీతో కలిసి మంతెన ఆర్నీ ఇన్ ఫ్రాను స్థాపించినట్లు, హవాలా మార్గంలో నిధులను మళ్లించడానికి దాన్ని వాడుకున్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. మంతెన కన్ స్ట్రక్షన్స్ త్రిపాఠీకి రూ.93 కోట్ల విలువ చేసే సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.  అర్నీ, మంతెన కలిసి ఫ్రాడ్ కు పాల్పడినట్లు గుర్తించారు.

Follow Us:
Download App:
  • android
  • ios