Asianet News Telugu

ముఖానికి ప్లాస్టిక్ కవర్, హీలియం గ్యాస్... కోల్ కతాలో హైదరాబాద్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మృతి !!

సంవ్రిత్ డిప్రెషన్ లో ఉన్న సంగతి తమకు తెలుసని అందుకే.. చాలాసార్లు కాల్ చేశామని.. అతను సమాధానం ఇవ్వలేదని తెలిపారు. దీంతో రూమ్మేట్స్ వచ్చి తమ దగ్గరున్న డూప్లికేట్ కీతో తాళం తీసి.. అతని గదిలో చూడగా అప్పటికే  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కనిపించాడు. అతని మొహానికి పెద్ద ప్లాస్టిక్ కవర్ చుట్టి,  మంచం పక్కన హీలియం సిలిండర్ కనిపించింది. 

Hyderabad bank executive found dead in Kolkata flat - bsb
Author
Hyderabad, First Published Jul 20, 2021, 9:40 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కోల్‌కతా : హైదరాబాద్ కు చెందిన ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ కోల్ కతాలో విగతజీవిగా మారాడు. తను ఉంటున్న పెయింగ్ గెస్ట్ హౌజ్ లో బెడ్ మీద ప్లాస్టిక్ కవర్ లో చుట్టి కనిపించాడు. అతడిని పాలిథిన్ సంచిలో చుట్టి, ఓ ప్లాస్టిక్ పైపుతో లోపలికి హీలియం గ్యాస్ ను ఇంజెక్ట్ చేయడం వల్ల చనిపోయినట్లు క్రైమ్ సీన్ లో తెలుస్తోంది. కోల్ కతాలోని సాల్ట్ లేక్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ కు చెందిన పి సంవిత్‌(25) సివిల్ ఇంజనీర్‌. నిరుడు ఆగస్టు నుంచి ప్రైవేట్ బ్యాంకుతో టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతను చనిపోయిన గదిలోనుంచి రెండు పేజీల "సూసైడ్ నోట్" దొరికిందని పోలీసులు తెలిపారు. 

ఒకరివెనుక ఒకరుగా కుటుంబ సభ్యులు చనిపోవడం, డిప్రెషన్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. కింద "ఐ క్విట్" అని సంతకం చేశాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని తెలిపాడు.  విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. సూసైడ్ నోట్ లో హ్యాండ్ రైటింగ్ అతనిదేనా అని పరిశీలిస్తున్నారు.  

ముందుగా సంవ్రిత్ మృతదేహాన్ని అతని కొలిగ్స్ రూమ్మేట్స్ కూడా అయిన ఇద్దరు చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వీరిని బీదన్నగర్ నార్త్ పోలీస్ స్టేషన్లో చాలాసేపు పోలీసులు ప్రశ్నించారు. 

ఫోరెన్సిక్ అధికారుల సమాచారం ప్రకారం.. ఇటీవలి కాలంలో హీలియంతో ఆత్మహత్య చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇది ఆన్ లైన్ లో ఈజీగా లభిస్తుంది. పార్టీలు, బర్త్ డేలకు హీలియం బెలూన్ల కోసం పార్టీ కిట్ తో భాగంగా దొరుకుతుంది. హీలియం ద్వారా త్వరగా, నొప్పి లేకుండా చనిపోతారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్లు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. 

పోలీసుల విచారణలో కొలిగ్స్ ఇద్దరూ.. తాము ఉదయమే బయటకు వెళ్లిపోయామని.. సంవ్రిత్ రూంలో ఉండిపోయాడని తెలిపారు. సంవ్రిత్ డిప్రెషన్ లో ఉన్న సంగతి తమకు తెలుసని అందుకే.. చాలాసార్లు కాల్ చేశామని.. అతను సమాధానం ఇవ్వలేదని తెలిపారు. 

దీంతో రూమ్మేట్స్ వచ్చి తమ దగ్గరున్న డూప్లికేట్ కీతో తాళం తీసి.. అతని గదిలో చూడగా అప్పటికే  అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి కనిపించాడు. అతని మొహానికి పెద్ద ప్లాస్టిక్ కవర్ చుట్టి,  మంచం పక్కన హీలియం సిలిండర్ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

వారు వచ్చి అతన్ని అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించి, బిధన్నగర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి పంపించారు. అప్పటికే అతను మరణించినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. అతని రూంలో సూసైడ్ నోట్ దొరికినా అందులోని చేతివ్రాత అతనిదేనా అనే దిశగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంవ్రిత్ మరణానికి అసలు కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. దీంట్లో భాగంగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపించామని, అతనికి హీలియం సిలిండర్‌ ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నామని బీదన్నగర్ కమిషనరేట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

సంవ్రిత్ పనిచేస్తున్న ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో సంవ్రిత్  కుటుంబంలోని చాలామంది చనిపోయారని.. తల్లిదండ్రులు, సోదరుడు, ఇటీవల అతని వదిన కూడా హైదరాబాద్లో మరణించిందని.. దీంతో అతను ఒంటరివాడినైపోయానని.. తనకు ఎవరూ లేరని తీవ్ర నిరాశలో ఉన్నాడని తెలిపారు. 

సంవ్రిత్ మృతదేహాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మంగళవారం అతని సన్నిహితులలో ఒకరు వస్తారు”అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios