Bangles: మంచి గాజులు వేసుకుందని భార్యను బెల్ట్‌తో చితకబాదిన భర్త
తన భార్య ట్రెండీ గాజులు ధరించడాన్ని భర్త తప్పుపట్టాడు. అంతేకాదు, బెల్ట్ తీసి భార్యను చితకబాదాడు. అతని తల్లి ఆమె వెంట్రుకలు లాగి చెంపలపై దారుణంగా కొట్టింది.
న్యూఢిల్లీ: ఆడవాళ్లు సాధారణంగానే అలంకరణపై మక్కువ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందులోనూ చీరలు,నగలు, గాజులు వంటివి సర్వసాధారణం. కానీ, ఆమె ట్రెండీగా ఉన్న గాజులు వేసుకున్నందుకు భర్త ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. బెల్ట్ తీసి చితకబాదాడు. ఆమె అత్త కూడా వెంట్రుకలు లాగి చెంపలపై చాలా సార్లు కొట్టింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నవి ముంబయిలో నవంబర్ 13వ తేదీన చోటుచేసుకుంది.
దిఘాకు చెందిన 23 ఏళ్ల మహిళ ఆమెకు నచ్చిన గాజులు వేసుకుంది. కానీ, తన భార్య ట్రెండీగా కనిపించే గాజులు ధరించడాన్ని 30 ఏళ్ల భర్త ప్రదీప్ ఆర్కడే జీర్ణించుకోలేదు. బెల్ట్ తీసి చితకబాదాడు. అతని తల్లి కూడా ఆమెపై చేయి చేసుకుంది. వెంట్రుకలు పట్టుకుని లాగింది. చెంపలపై చెడామడా కొట్టేసింది. అతని కుటుంబానికే చెందిన మరో మహిళ కూడా ఈ గొడవలో తలదూర్చింది. ముగ్గురు కలిసి ఆమెను చితక్కొట్టి నేలపై పడేశారు.
Also Read: Vijayashanthi: కేసీఆర్ స్ట్రాటజీని విజయశాంతి దెబ్బతీసినట్టేనా? ఆమెతో కాంగ్రెస్‌కు కలిసివచ్చేదేమిటీ?
ఆ తర్వాత ఆమె పూణెలోని తల్లి వద్దకు వెళ్లింది. అక్కడే ఆమె కేసు పెట్టింది. పోలీసులు ఆ కేసును దర్యాప్తు కోసం నవి ముంబయికి బదిలీ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.