భార్యకు తుపాకీ కాల్చడం నేర్పిస్తానని చెప్పి దానికే బలిచ్చాడో భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటక, తుముకూరు జిల్లాలోని డి.కొరటిగెరెలో సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెడితే డి.కొరటిగెరెలో ఉండే కృష్ణప్ప (35),  శారద (28) భార్యభర్తలు. సోమవారం రాత్రి 9:30 సమయంలో భర్త కృష్ణప్ప తన స్నేహితుని వద్దనున్న నాటు తుపాకీని ఇంటికి తీసుకొచ్చాడు. అది భార్యకు చూపించి దీనిని ఎలా కాల్చాలో నేర్పిస్తా అన్నాడు. 

అయితే ఏం జరిగిందో కానీ తూటా పాయింట్‌ బ్లాంక్‌లో నేరుగా ఆమె తలలోకి దూసుకుపోయింది. శారద అక్కడికక్కడే క్షణాల్లో మృతిచెందింది. తెల్లవారుజామున 2 గంటలకు హెబ్బూరు పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని కృష్ణప్పను అరెస్టు చేశారు. కావాలనే హత్య చేశాడా, ప్రమాదవశాత్తు జరిగిందా అన్నది తేలాల్సి ఉంది.