తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని.. తన మీద మంత్రతంత్రాలు చేసి చంపాలని చూస్తుందని ఓ వ్యక్తి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి చనిపోవడం ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తుంది. దీనికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనికి సంబంధించి సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ తర్వాత ఆత్మహత్యకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలంలో పోలీసులకు మృతుడు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో అతను భార్యకు ఉన్న వివాహేతర సంబంధం గురించి రాశాడు. దాని గురించి రాస్తూ ‘కృష్ణతో పాటు తోటలో నీతూ ఉన్నప్పుడు నేను వారిని పట్టుకున్నాను’ అని రాసుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే లసుడియా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ లో హితేష్ పాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతను తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన మరణానికి కారణాన్ని సూసైడ్ నోట్ కూడా రాశాడు.
కృష్ణ రాథోడ్ అనే వ్యక్తితో నా భార్య నీతూ పాల్ కి వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరిని నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. తోటలో వారిద్దరూ కలిసి ఉండగా చూశాను. అప్పటినుంచి వారు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు’ అని రాసుకొచ్చాడు. కొద్ది రోజులుగా నీతో కృష్ణ వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటున్నారు అది నేను గమనించాను. గార్డెన్లో వారు కలుసుకున్న తర్వాత నీతూ చేసిన చాటింగుతో నాకు చాలా విషయాలు తెలిసాయి. ఆమెతరచుగా కృష్ణగదికి వెళ్లి ఖరీదైన బహుమతులు ఇచ్చేది. కృష్ణనూ తన సోదరుడుగా చెప్పుకునేది. అతనితో నగదు లావాదేవీలు కూడా చేసేది. కొద్ది రోజుల క్రితం కృష్ణ నీతూకి కారు కూడా కొనిచ్చాడు. ఆ కారు నీతూ పేరు మీదే ఉంది. ఈ కేసులో రాణి ఉదాసి అనే మరో మహిళ కూడా భాగస్వామి.
కృష్ణ, నీతూలు కలిసి రాణి ఇంట్లో నా మీద మంత్రతంత్రాలు చేసేవారు. ఈ క్రమంలోనే ఏడాదికాలంగా నాకు స్లో పాయిజన్ ఇచ్చారు. దీంతో నా శరీరం అంతా నల్లగా మారిపోయింది.. నేను నీరసపడిపోయాను. నేను చెబుతున్న విషయాలన్నీ నా పోస్టుమార్టంలో బయటపడనున్నాయి. వారి చాటింగుల మీద పోలీసులు విచారణ జరపాలి. వారిని శిక్షించాలి. ఇదే నా కోరిక. నా చావుకు వీరు ముగ్గురే కారణం’ అని రాసుకొచ్చాడు. ‘నన్ను నిర్వీడిని చేసి చంపడమే కాదు నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకోవాలని కూడా నీతూ ప్రయత్నిస్తోంది. నేను చనిపోయిన తర్వాత నా ఆస్తి మొత్తాన్ని నా కొడుకు యువరాజుకు, నా తల్లిదండ్రులకు ఇవ్వాలి. నా భార్య నన్ను చంపాలని అనుకుంది అందుకే అన్నిచోట్లా నామినేషన్లలో నా పేరు రాయించుకుంది. రాణి, నీతూ, కృష్ణలే నా చావుకు బాధ్యులు’ అని కూడా రాశాడు.
వీటితోపాటు ఇంకా అనేక విషయాలను మృతుడు తన సూసైడ్ నోట్లో రాశాడు. ఆ లేఖలో కొందరికి కృతజ్ఞతలు తెలిపాడు. తన కొడుకుకు, కుటుంబానికి తన మరణం తర్వాత సహాయం చేయవలసిందిగా అభ్యర్థించాడు. ఈ మరణాన్ని ఆత్మహత్య కేసుగా నమోదు చేశామని దర్యాప్తు అధికారి మీడియాకు తెలిపారు. సూసైడ్ లెటర్ లో రాసినట్లుగా మృతుడి భార్య వివాహేతర సంబంధం బయటపడిందని తెలిపారు. పోస్టుమార్టం తర్వాత దీనిమీద తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
