బిర్యానీ కారణంగా నిండు ప్రాణం పోయింది. దంపతుల మధ్య దీని కారణంగా గొడవ జరిగి.. భార్యపై భర్త నిప్పంటించాడు. ఈ ఘటనలో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది.
బిర్యానీ అడిగిందని కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు భర్త. ఈ ఘటన చెన్నైలోని ఆయనవరం గ్రామంలో జరిగింది. కరుణాకరన్, పద్మావతి దంపతులు ఆయనవరంలో వుంటున్నారు. కరుణాకరన్ రైల్వే రిటైర్మెంట్ ఉద్యోగిగా ఉంటున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కరుణాకరన్ దంపతులు మాత్రమే ఆయనవరంలో వుంటున్నారు. కరుణాకరన్ బయటి నుంచి బిర్యానీ తెచ్చుకోవడంతో తనకు కూడా కావాలని పద్మావతి అడిగింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
చివరికి మాటా మాటా పెరగడంతో పాటు కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో ఇరుగుపొరుగు వారిని ఆసుపత్రికి తరలించారు. పద్మావతి మృతి చెందగా... కరుణాకరన్ పరిస్ధితి విషమంగా వుంది. మరణానికి ముందు పద్మావతి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు కరుణాకరన్‌పై హత్య కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
