తనకు కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్న భార్య అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని చూడలేకపోయిన ఓ భర్త.. ఆమెను చంపి అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని పుణేకు చెందిన గణేశ్ స్థానిక ఐటీ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య వృశాలి గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె అనారోగ్యంతో బాధపడటాన్ని గణేశ్ తట్టుకోలేకపోయాడు.

భార్య గురించి ఆలోచిస్తూ లోలోపల కుమిలిపోయేవాడు. చావు ఒక్కటే తన సతీమణిని బాధ నుంచి విముక్తి కలిగిస్తుందని భావించాడు. దీనిలో భాగంగా ఓ రోజు వృశాలిని సుత్తితో బలంగా కొట్టి హత్య చేశాడు.

అనంతరం తాను కూడా ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంభసభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.