Asianet News TeluguAsianet News Telugu

‘నువ్వు హిందువువి, నిన్ను పెళ్లి చేసుకున్నానని ఇంట్లోకి రానివ్వడం లేదు..’ అంటూ భార్య చేసిన పని...

పెళ్లి తర్వాత అసిఫాను  తీసుకుని తిరిగి  నాసిక్ వెళ్ళిపోయాడు.  అక్కడే ఒక Mobile Recharge Shop పెట్టుకుని జీవిస్తున్నాడు.నాలుగు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా అసిఫా  కనిపించకుండా పోయింది. దీంతో మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు 

husband murdered wife due to elope with aunt's son in rajasthan
Author
Hyderabad, First Published Nov 2, 2021, 11:31 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఇద్దరు మహిళలు  టి షాపు వద్ద మాట్లాడుకుంటుండగా..  అనుకోకుండా వెనకనుంచి ధరించిన మహిళా వచ్చి వారిలో ఒకరిని కత్తితో పొడిచి చంపేసింది.  ఈ ఘటన అక్టోబర్ 22న జరిగింది.  చనిపోయిన యువతి ఒక ముస్లిం.  ఆమె పేరు  అసిఫా.  పోలీసులు ఆమె Murder caseను ఛేదించడానికి చాలా కష్టపడ్డారు.

సుమారు 400  సీసీటీవీ వీడియోలు చూసి,15 వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి  ఆ Burqa లో వచ్చిన వ్యక్తిని పట్టుకున్నారు.  పోలీసుల కథనం ప్రకారం...అసిఫా  కథ  మహారాష్ట్రలోని పూణే నగరంలో మొదలైంది.  పూణేలోని ఒక మొబైల్ రిపేరింగ్ షాప్ లో  మహేష్ అనే వ్యక్తి పని చేసేవాడు.

అసిఫా  తరచుగా అతని వద్దకు తన మొబైల్ రీఛార్జ్,  రిపేరింగ్ కోసం వచ్చేది.  దీంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది.  కొద్ది కాలం తర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది.  వారిద్దరూ పారిపోయి 2020 లో ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. మహేష్ మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి చెందినవాడు. పెళ్లి తర్వాత అసిఫాను  తీసుకుని తిరిగి  నాసిక్ వెళ్ళిపోయాడు.  అక్కడే ఒక Mobile Recharge Shop పెట్టుకుని జీవిస్తున్నాడు.

నాలుగు నెలలు గడిచిన తర్వాత ఒకరోజు అనుకోకుండా అసిఫా  కనిపించకుండా పోయింది. దీంతో మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కొన్ని రోజుల తర్వాత అసిఫా  ఆచూకీ  తెలిసింది అని చెప్పడంతో మహేష్ వారితో వెళ్ళాడు. అసిఫా  పూణే లో  సాహిల్ అనే యువకుడు ఇంట్లో ఉంటుంది.

సాహిల్  వరుసకు అసిఫా మేనత్త కొడుకు. అతను ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో  వెయిటర్ గా పని చేస్తున్నాడు.  మహేష్  వెంట వచ్చిన పోలీసులు  అసిఫాను Inquiry చేయగా.. తాను ఇకనుంచి సాహిల్ తోనే ఉంటానని,  మహేష్ తో ఇక ఉండలేనని చెప్పింది.  దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మహేష్ మాత్రం అక్కడే ఉన్నాడు. అసిఫాని  తనతో వచ్చేయమని వేడుకున్నా ఆమె వినలేదు.  అసలు ఇదంతా ఎందుకు చేశావు?  అని మహేష్ ప్రశ్నించగా.. ‘‘ నువ్వు ఒక హిందువువి, నిన్ను  పెళ్లి చేసుకోవడం వల్ల  మా ఇంట్లో వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వడం లేదు.  నిన్ను వదిలేసి ఒక Muslim అబ్బాయి తో పెళ్లి చేసుకుంటే,  మళ్లీ వాళ్లు అంతా నాకు దగ్గర అవుతారు’  అని చెప్పింది.  ఇది విన్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

 కొద్దిరోజుల తర్వాత సాహిల్ కు కలకత్తా లో ఉద్యోగం రావడంతో అసిఫా కూడా అక్కడికి వెళ్లి పోయింది.  తన ఫోన్ నెంబర్ ని కూడా మార్చేసింది.  మహేష్  అసిఫాను మరిచి పోలేక మళ్ళీ ఆమె కోసం వెళ్ళాడు.  కానీ అసిఫా  అతనికి దొరకలేదు.  మరోవైపు రాజస్థాన్లో అసిఫా స్నేహితురాలు  తల్లి  కామెనీ ఉండేది.

ఘోర రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ దుర్మరణం..!

 ఆమెకు అసిఫా అంటే చాలా ఇష్టం. మహేష్ తో పెళ్లి తర్వాత కామిని వారిద్దరికీ చాలా సహాయం చేసింది దీంతో మహేష్ కామెడీ వద్దకు రాజస్థాన్ వెళ్లి ఒకసారి అసిఫా ను కలవాలని ఉంది అని చెప్పాడు కొత్త నెంబర్ ఉంది మహేష్ వారిద్దరినీ కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ చేసి మాట్లాడింది. 

 ఆసిఫా ఒకసారి రాజస్థాన్ రావడానికి ఒప్పుకుంది అలా ఆసిఫా Rajasthanనుంచి ఒక రోజు కలిసింది వారిద్దరూ అక్కడ మాట్లాడుతుండగా వెనకనుంచి ఒక బుర్కా వేసుకున్న మహిళ వచ్చి ఒక్కసారిగా అసిఫాను  కత్తితో పొడిచి చేసి అక్కడి నుంచి పారిపోయింది.  అసిఫాను ఆస్పత్రికి తీసుకెళ్లగా  ఆమె అప్పటికే మరణించిందని డాక్టర్లు చెప్పారు.

పోలీసులకు kaamini జరిగిందంతా చెప్పింది.  రాజస్థాన్ పోలీసులు ఆ బుర్కాలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాదాపు 400 సీసీటీవీ  వీడియోలు వెతకగా,  ఆ బుర్కాలో వచ్చింది మహేష్ అని కనిపించింది.  దీంతో పోలీసులు Nashikలో దాగి ఉన్న మహేష్ ను పట్టుకున్నారు. ఈ కేసులో విచిత్రమేమిటంటే తీసుకెళ్లడానికి ఆమె కుటుంబసభ్యులు ఎవరూ రాలేదు చివరికి సాహిల్ కూడా రాలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios