భర్త కళ్లుగప్పి ప్రియుడితో రాసలీలల్లో మునిగిపోయిన భార్యను చంపి ఏకంగా ఆమె తలతోనే పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు ఓ భర్త. చిక్కమగళూరు జిల్లా తరికెరెకు చెందిన సతీశ్, రూప భార్యాభర్తలు. రూపను తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సతీశ్.. వీరికి ఇద్దరు పిల్లలు..

బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తూ ఇటీవల అజ్జంపురలోని శివణి ప్రాంతంలో మాంసం దుకాణాన్ని పెట్టుకుని భార్య, పిల్లలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో రూప అదే గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది... దీనిని గమనించిన భర్త పద్దతి మార్చుకోవాల్సిందిగా భార్యను హెచ్చరించాడు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఇరువురి మధ్య గొడవలు వచ్చాయి.

పోలీసులు, స్థానికులు ఎంతగా రాజీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.. ఒక రోజు రూప, సునీల్‌లు కలిసి ఉండటాన్ని గమనించిన సతీష్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. కొడవలిని తీసుకుని సునీల్‌పై విసరగా అతను తప్పించుకుని పారిపోయాడు.

దీంతో అక్కడే ఉన్న రూపపై దాడి చేసి తల, మొండెం వేరు చేసి తలను బ్యాగులో వేసుకుని 20 కిలోమీటర్ల దూరంలోని అజ్జంపుర పోలీస్ స్టేషన్‌కు బైకులో వెళ్లి లొంగిపోయాడు. రూ.3 లక్షలు అప్పు చేసి సునీల్‌కు ఇచ్చానని.. అలాంటి వాడు తన కాపురంలో చిచ్చు పెట్టాడని.. జైలు నుంచి విడుదలైన తర్వాత అయినా సునీల్‌ను హతమారుస్తానని సతీశ్ సవాల్ చేశాడు.