ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి భార్యను చంపేసి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు ఏం జరుగుతుందో అర్థం కాక ఏడవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. భార్య అప్పటికే మరణించగా.. భర్త మాత్రం హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ పొందుతూ మరణించాడు. 

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. బరేలీ జిల్లాలోని సిరౌలీ ఏరియాకు చెందిన ఓ వ్యక్తి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఆయన స్వయంగా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వెంటనే ఎవరికీ తెలియలేదు. ఈ దంపతులు పిల్లలు ఏడుపు లంకించుకోవడంతో ఇరుగు పొరుగు వారు అలర్ట్ అయ్యారు. 

దాలిపూర్‌కు చెందిన 28 ఏళ్ల మైకులాల్, 25 ఏళ్ల రామ్ దులారీ భార్య, భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. రెండేళ్ల కొడుకు, నాలుగేళ్ల కొడుకు. అయితే, ఆ భార్య, భర్తలకు మధ్య గొడవ జరిగింది. భార్య రామ్ దులారీని భర్త మైకులాల్ చంపేశాడు. మైకులాల్‌ మానసికంగా స్థిమితుడు కాదు. భార్యను చంపేసిన తర్వాత మైకులాల్ కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Also Read: ప్రధాని మోడీపై కామెంట్లు.. ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు ఈసీ నోటీసులు

పిల్లలు ఏడుపులు మొదలు పెట్టడంతో ఇరుగు పొరుగు వారు వచ్చారు. వాళ్లు వచ్చేసరికి రామ్ దులారి మరణించింది. మైకులాల్‌ మాత్రం కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయనను వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, ట్రీట్‌మెంట్ జరుగుతుండగానే మైకులాల్ కూడా మరణించాడు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్టు పోలీసులు వివరించారు.